ETV Bharat / international

ఫ్రాన్స్ పర్యటన​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - ఫ్రాన్స్ పర్యటన

ప్రధాని మోదీ నేడు ఫ్రాన్స్​కు బయలుదేరనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడితో ఉన్నతస్థాయి చర్చలు జరపనున్నారు. అనంతరం పారిస్​లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారతీయ సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ.

నేడు ఫ్రాన్స్ పర్యటన​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Aug 22, 2019, 7:53 AM IST

Updated : Sep 27, 2019, 8:31 PM IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్​కు వెళ్లనున్నారు. రక్షణ, అణు రంగం, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలపేతానికి ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో చర్చలు జరపనున్నారు మోదీ.

ఫ్రాన్స్​ నుంచే శుక్రవారం యూఏఈ, బహ్రెయిన్​ పర్యటనకు బయలుదేరనున్నారు ప్రధాని. ఈ నెల 25న ఫ్రాన్స్​కు తిరిగి వచ్చి బియరిజ్​ నగరంలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొననున్నారు.

యునెస్కోలో ప్రసంగం...

గురువారం సాయంత్రం మోదీ ఫ్రాన్స్​కు చేరుకుంటారు. అనంతరం ఆ దేశాధ్యక్షుడిని కలిసి వ్యూహాత్మక సంబంధాలపై చర్చిస్తారు. శుక్రవారం ఫ్రాన్స్​ ప్రధాని ఫిలిప్​తో చర్చలు జరుపుతారు. అనంతరం పారిస్​లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇదీ చూడండి:తమిళనాడులో ఘోర ప్రమాదం... నలుగురు మృతి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.