మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ, విదేశాలకు పరారైన వివాదాస్పద ఇస్లామిక్ ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు ఉచ్చు బిగిస్తోంది భారత్. రష్యా వేదికగా మలేషియా ప్రధాని మహతిర్ బిన్ మహ్మద్‌తో భేటీ సందర్భంగా జకీర్ అంశాన్ని లేవనెత్తారు ప్రధాని మోదీ. జకీర్‌ను భారత్‌కు అప్పగించే అంశంపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు.
"జకీర్ నాయక్ అప్పగింత అంశాన్ని ప్రధానమంత్రి మోదీ లేవనెత్తారు. ఈ విషయానికి సంబంధించి ఇరు దేశాల అధికారులు సంప్రదింపులు జరపాలని నేతలు ఇద్దరూ నిర్ణయించారు. ఇది ఒక ముఖ్యమైన సమస్యగా పేర్కొన్నారు."
- విజయ్ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి
ఇటీవలే జకీర్ నాయక్‌పై రెడ్‌కార్నర్ నోటీసుల జారీలో ఆలస్యంపై ఇంటర్‌పోల్ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది భారత్. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తాజాగా మలేషియా ప్రధానితో భేటీలో జకీర్ అంశాన్ని ప్రస్తావించటం... జకీర్‌పై చర్యలకు కేంద్రం పట్టుదలతో ఉన్నట్లు తెలియచేస్తోంది.
మలేషియాలో..
ఓ వర్గం యువతను తీవ్రవాదం వైపు దారిమళ్లిస్తున్నారని జకీర్‌పై ఆరోపణలున్నాయి. ఆయనకు అక్రమ మార్గంలో కోట్లాది రూపాయల విరాళాలు అందినట్లు ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. జకీర్ ప్రసంగాలకు ఆకర్షితులై యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, మలేసియా వంటి దేశాల నుంచి కొందరు భారీగా నిధులు పంపినట్లు పేర్కొంది.
ఈడీ విచారణను తప్పించుకునేందుకు ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్నారు జకీర్.
ఇదీ చూడండి: జకీర్ నాయక్ ఖాతాల్లో కోట్లాది అక్రమ నిధులు