ETV Bharat / international

'అసలు మొత్తం తీసుకోండి.. నన్ను వదిలేయండి'

author img

By

Published : Feb 14, 2020, 9:28 AM IST

Updated : Mar 1, 2020, 7:24 AM IST

బ్యాంకు రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్​మాల్యా అసలు మాత్రమే చెల్లించగలనంటూ బ్యాంకులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. తనను భారత్​కు అప్పగించాలన్న కేసులో బ్రిటన్ హైకోర్టులో విచారణకు హాజరయ్యారు మాల్యా. ఈ కేసులో త్వరలోనే తీర్పు వెల్లడించనుంది న్యాయస్థానం.

Please banks, take your money, says Vijay Mallya
అసలు మొత్తం తీసుకోండి.. బ్యాంకులను మాల్యా విజ్ఞప్తి

భారతీయ బ్యాంకులకు రూ. 9000 కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న రుణఎగవేతదారు, వ్యాపారవేత్త విజయ మాల్యా.. అసలు మొత్తం చెల్లించగలనని, ఈ మొత్తాన్ని తీసుకోవాలని అభ్యర్థించారు. భారత్​కు అప్పగించాలన్న పిటిషన్​పై విచారణలో భాగంగా బ్రిటన్ హైకోర్టుకు హాజరైన మాల్యా ఈ మేరకు బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో త్వరలో తీర్పు వెల్లడించనుంది లండన్​ కోర్టు.

"నేను బ్యాంకులకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. తక్షణమే అసలు మొత్తం చెల్లిస్తాను. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఎన్​ఫోర్సమెంట్​ డైరెక్టరేట్ (ఈడీ)​ నా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వాటిని జప్తు చేసింది. నేను ఎటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదు. ఈడీ జప్తు చేసిన ఆస్తులపై తమకే అధికారం ఉందంటూ.. ఈడీ, బ్యాంకులు పోరాడుతున్నాయి. భారత్​కు రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే నా కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను."

-విజయ్​మాల్యా

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఈడీలు గత నాలుగేళ్లుగా నన్ను భారత్​ రప్పించడానికి ప్రయత్నించడం అసమంజసమని మాల్యా ఆరోపించారు.

ఇదీ చూడండి: ‘కరోనా’ అనుమానితుడిని కాల్చి చంపిన ఉత్తరకొరియా

Last Updated : Mar 1, 2020, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.