ETV Bharat / international

వృద్ధులపై ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా పనితీరు భేష్​! - 70 ఏళ్లు దాటిన వారిపై ఫైజర్‌, ఆస్ట్రాజెనకా కరోనా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి

70 ఏళ్లు దాటిన వారిపై ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 3-4 వారాల్లో ఈ మార్పు కనిపిస్తోందని తెలిపింది. 70 ఏళ్లు పైబడిన వారిలో కరోనా మరణాలను 83 శాతం తగ్గించిందని అధ్యయనం పేర్కొంది.

Pfizer, Oxford vaccines
ఫైజర్‌, ఆస్ట్రాజెనకా పనితీరు భేష్​
author img

By

Published : Mar 2, 2021, 5:08 PM IST

ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు 70 ఏళ్లు దాటిన వారిపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ కరోనా టీకాలు వయో వృద్ధుల్లో తీవ్రమైన కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గిస్తున్నాయని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ అధ్యయనం తెలిపింది.

70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని పరిశోధకులు అధ్యయనం చేశారు. లండన్‌లో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వీరు పరీక్షించారు. 70 ఏళ్లు దాటిన వారిలో ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు 80 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేశాయని ఈ నివేదిక వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 3-4 వారాల్లో ఈ మార్పు కనిపిస్తోందని తెలిపింది.

ఫైజర్ వ్యాక్సిన్‌ 70 ఏళ్లు పైబడిన వారిలో కరోనా మరణాలను 83 శాతం తగ్గించిందని అధ్యయనం తెలిపింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలను ఒకే మోతాదుతో వేయడం వల్ల వృద్ధుల్లో వైరస్‌ గణనీయంగా తగ్గిందని పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాక్సిన్లు ఇన్‌ఫెక్షన్లను తగ్గించి ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతున్నాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: టీకాపై అసత్య ప్రచారానికి ట్విట్టర్​ బ్రేకులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.