ఫైజర్ టీకాకు ఐరోపా సమాఖ్య అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో ఫైజర్ టీకాను ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో వినియోగించనున్నాయి. క్రిస్మస్ తర్వాత ప్రజలకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయా దేశాలు ప్రారంభించనున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ అన్ని రకాల భద్రతా ప్రమాణాలను అందుకుందని.. యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ ప్రకటించిన కొద్దిగంటల్లోనే ఈయూ కార్యనిర్వాహక కమిషన్ ఆమోదం తెలిపింది.
సభ్య దేశాల్లో వ్యాక్సిన్ ఒకే సమయం, ఒకే రకమైన షరతులతో అందిస్తామని ఈయూ ప్రకటించింది. ఈ టీకా వచ్చే శనివారం నాటికి ఆయా దేశాలను చేరుకోనుండగా.. ఈ నెల 27, 29 మధ్యలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఫైజర్ టీకాకు ఇప్పటికే బ్రిటన్, అమెరికాల్లో అనుమతులు లభించాయి.
ఇదీ చూడండి: పాక్లో గుడి నిర్మాణానికి ఇమ్రాన్ సర్కార్ పచ్చజెండా