ETV Bharat / international

ఆ బ్లడ్​గ్రూప్​ వారికి కరోనా సోకే అవకాశం తక్కువే! - ఓ బ్లడ్​ గ్రూప్​ కరోన వైరస్​

బ్లడ్​ గ్రూప్​లకు, కరోనా సోకే అవకాశాలకు సంబంధం ఉందని తెలిపే రెండు అధ్యయనాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా 'ఓ' బ్లడ్​ గ్రూప్​ ఉన్న వారు.. కరోనా బారిన పడే అవకాశాలు తక్కువేనని ఇవి తెలిపాయి. అదే సమయంలో.. ఇతరులతో పోల్చితే వీరికి ఒకవేళ కరోనా సోకినా.. వైరస్​ తీవ్రత తక్కువని స్పష్టం చేశాయి.

People with blood type O may have lower risk of COVID-19 infection, studies suggest
ఆ బ్లడ్​ గ్రూప్​ వారికి కరోనా సోకే అవకాశం తక్కువే!
author img

By

Published : Oct 15, 2020, 7:28 PM IST

"ఓ" బ్లడ్​ గ్రూప్​ ఉన్న వారు కరోనా బారినపడే అవకాశం తక్కువని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఒకవేళ వీరికి కరోనా సోకినా.. ఇతరులతో పోల్చితే తీవ్రత కూడా తక్కువేనని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

బ్లడ్​ అడ్వాన్సెస్​ జర్నల్​లో ఈ రెండు అధ్యయనాలు ప్రచురితమయ్యాయి. దీనితో బ్లడ్​ గ్రూప్​నకు, కరోనా బారినపడే అవకాశాలకు సంబంధం ఉందనేందుకు మరిన్ని ఆధారాలు లభించినట్టు అయ్యింది.

వారిలో ఎక్కువే...

తొలి అధ్యయనంలో.. డెన్​మార్క్​లో కరోనా సోకిన దాదాపు 4,70,000మంది హెల్త్​ రిజిస్ట్రీ డేటాను.. 22లక్షల మంది సాధారణ జనాభా డేటాతో పోల్చి చూశారు పరిశోధకులు. కరోనా బారినపడ్డ వారిలో 'ఓ' బ్లడ్​ గ్రూప్​ ఉన్నవారు తక్కువగా ఉన్నట్టు.. ఏ,బీ,ఏబీ గ్రూప్​ల వారు అధికంగా ఉన్నట్టు గుర్తించారు.

అయితే ఏ, బీ, ఏబీ బ్లడ్​ గ్రూప్​ల మధ్య కరోనా సోకే అవకాశంలో పెద్దగా వ్యత్యాసాన్ని చూడలేదన్నారు పరిశోధకులు.

కెనడాలో జరిగిన మరో అధ్యయనంలో.. ఓ, బీ బ్లడ్​ గ్రూప్​లతో పోల్చితే.. ఏ, ఏబీ బ్లడ్​ గ్రూప్​ల వారే అత్యధికంగా కరోనా బారినపడుతున్నట్టు తేలింది. వాంకోవర్​ నగరంలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య పరిస్థితి విషమించిన 95మంది రోగుల డేటాను పరిశీలించిన అనంతరం ఈ విషయం నిర్ధరించారు.

ఓ, బీ గ్రూప్​లతో పోల్చితే.. మిగిలిన బ్లడ్​ గ్రూప్​ల వారికి అవయవాలు దెబ్బతినడం, విఫలమయ్యే అవకాశం కూడా ఎక్కవేనని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే ఈ పూర్తి వ్యవహారంపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇదీ చూడండి:- కరోనా కుటుంబం నుంచి మరో వైరస్- ఇదీ చైనా నుంచే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.