ETV Bharat / international

బోరిస్​కు పోలీసుల ప్రశ్నావళి.. కొవిడ్​ లాక్​డౌన్​ పార్టీలే కారణం

author img

By

Published : Feb 13, 2022, 8:37 AM IST

Party Gate Row: బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు లండన్​ మెట్రోపాలిటన్​ పోలీసులు ప్రశ్నావళి పంపారు. కొవిడ్​ లాక్​డౌన్​ సమయంలో డౌనింగ్ స్ట్రీట్​లో జరిగిన విందు వినోదాలకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా చర్యలు చేపట్టారు. పోలీసులు ప్రధాని దంపతులతోపాటు దాదాపు 50 మందికి ఈ ప్రశ్నావళి పంపారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు విధించారు.

UK prime minister
బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​

Party Gate Row: కొవిడ్​ లాక్​డౌన్​ సమయంలో ప్రధాని నివాసం ఉన్న డౌనింగ్​ స్ట్రీట్​లో జరిగిన విందు వినోదాలకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా లండన్​ మెట్రోపాలిటన్​ పోలీసులు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు ప్రశ్నావళి పంపారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం శనివారం ధ్రువీకరించింది.

కొవిడ్​ సమయంలో తన ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రధాని స్వయంగా ఉల్లంఘించినట్లు తేలితే బోరిస్​ జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే.. 'పార్టీ గేట్'​ వ్యవహారంగా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో ప్రధానిని దోషిగా పేర్కొంటూ, పదవి నుంచి ఆయన తప్పుకోవాలని ఇంతకాలం డిమాండ్​ చేస్తూ వచ్చిన ప్రత్యర్థులు స్వరం మరింత పెంచుతారు. సొంత పార్టీలోనూ బోరిస్​ జాన్సన్​పై ఇదేవిధమైన ఒత్తిడి ఉంది. పలువురు మాజీ నేతలు ఆయనపై విమర్శలు ఎక్కపెడుతున్నారు. కన్జర్వేటివ్​ పార్టీ మాజీ నేత ఐయాన్​ డంకన్​ స్మిత్​ మాట్లాడుతూ.. బోరిస్​ జాన్సన్​ నింబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసు విచారణలో తేలితే ఆయన పదవిలో కొనసాగడం కష్టమే అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం నిజాలు దాచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటన్​ ప్రతిష్టను ముక్కలు చేస్తోందని మాజీ ప్రధాని జాన్​ మేజర్​ మండిపడ్డారు.

ఉక్రెయిన్​పై రష్యా దాడి చేయవచ్చన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న బ్రిటన్​ పౌరులు వెనక్కు రావాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితుల్లో 'పార్టీగేట్​' ఆరోపణలతో బోరిస్​ జాన్సన్​ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

పోలీసులు ప్రధాని దంపతులతోపాటు దాదాపు 50 మందికి ఈ ప్రశ్నావళి పంపారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు విధించారు.

ఇదీ చూడండి: పుతిన్​కు బైడెన్​ ఫోన్​... తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.