ETV Bharat / international

'కరోనా ఉద్ధృతికి ఆ నాలుగే ప్రధాన కారణాలు' - డెల్టావేరియంట్​ వ్యాప్తి

కరోనా వ్యాప్తి భారత్ సహా పలు దేశాల్లో తగ్గినట్లే తగ్గి తాజాగా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌. వేగంగా వ్యాపిస్తొన్న డెల్టా వేరియంట్‌ కరోనా ఉద్ధృతికి ప్రధాన కారణం కాగా నిబంధనల సడలింపు, నెమ్మదిగా సాగుతోన్న వ్యాక్సినేషన్‌, వైరస్‌ను గుర్తించకోకుండా ప్రజలు సమూహాలుగా తిరగడం వలన కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వివరించారు.

pandamic isnot slowing down , sowmya swamynathan
కరోనా, కొవిడ్​, కరోనా వ్యాప్తి
author img

By

Published : Jul 10, 2021, 3:24 PM IST

కొన్ని రోజులుగా నెలకొంటున్న పరిస్థితులను చూస్తుంటే కరోనా మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదనిపిస్తోంది. ఇటీవల భారత్ సహా పలు దేశాల్లో వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టినట్లే కన్పించినా.. తాజాగా మళ్లీ వ్యాప్తి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌. వేగంగా వ్యాప్తిస్తోన్న డెల్టా వేరియంట్‌ కరోనా ఉద్ధృతికి ప్రధాన కారణం కాగా.. నిబంధనల సడలింపు, నెమ్మదిగా సాగుతోన్న వ్యాక్సినేషన్‌, వైరస్‌ను గుర్తించకపోవడం వల్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయని చెబుతున్నారు.

కొవిడ్‌ తాజా పరిస్థితిపై తాజాగా ఆమె బ్లూమ్‌బర్గ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కేసులు నానాటికీ పెరుగుతున్నాయని, ముఖ్యంగా ఆఫ్రికాలో గత రెండువారాలుగా కొత్త కేసుల్లో 30 నుంచి 40శాతం వృద్ధి కనిపిస్తోందని ఆమె తెలిపారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా దాదాపు 5లక్షల కేసులు బయటపడగా.. 9వేల మందికి పైనే వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే 'కరోనా.. తగ్గే మహమ్మారి'లా కన్పించట్లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

కారణాలివే..

కరోనా ఉద్ధృతికి నాలుగు ప్రధాన కారణాలున్నాయని ఆమె తెలిపారు. కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్‌ వల్ల కేసులు పెరుగుతున్నాయని స్వామినాథన్‌ తెలిపారు. 'ఇప్పటివరకు కరోనాలో పుట్టుకొచ్చిన అనేక రకాల్లో డెల్టానే అత్యంత ప్రమాదకరంగా కన్పిస్తోంది. కేసుల వృద్ధికి ఇదే ప్రధాన కారణం. ఒక వ్యక్తికి ఒరిజినల్‌ కరోనా వైరస్‌ సోకితే.. అతడి నుంచి మరో ముగ్గురికి వైరస్‌ వ్యాపిస్తుంది. కానీ డెల్టా వేరియంట్‌ సోకితే మాత్రం.. ఆ వ్యక్తి నుంచి మరో 8 మందికి వ్యాపిస్తుంది' అని ఆమె వివరించారు. ఇక ఈ 8 మంది తమకు కరోనా సోకిన విషయం తెలియక కుటుంబసభ్యులు, ఇతరులతో కలవడం, ప్రజలతో మమేకమవడంతో వైరస్‌ మరింత ఎక్కువ మందికి సోకుతుందని ఆమె తెలిపారు.

ఆంక్షల సడలింపుతో నిర్లక్ష్యం..

ఇటీవల చాలా దేశాల్లో కరోనా ఆంక్షలను సడలించారు. దీంతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా వైరస్‌ ఉద్ధృతికి కారణమవుతోందని స్వామినాథన్‌ చెప్పారు. మరోవైపు అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని చోట్ల పంపిణీ నెమ్మదిగా సాగుతుండటం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోందని అన్నారు. ఆక్సిజన్‌ కొరత, ఆసుపత్రి పడకల లేమి కారణంగా మరణాలు రేటు కూడా అధికంగా ఉంటోందని ఆమె చెప్పుకొచ్చారు.

కరోనా ఆగదు.. మనమే ఆగాలి..

కరోనాపై నిర్లక్ష్యం వద్దని భారత ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల కొన్ని పర్యాటక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీటిపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ఆంక్షలు సడలించినంత మాత్రాన.. కరోనా అంతమైనట్లు కాదని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరిస్తోంది. 'సెలవులు, సరదాలు మళ్లీ వస్తాయి.. కానీ కరోనా ఆగదు' అంటూ వైరస్‌పై అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇదీ చూడండి: Delta variant: కొవిడ్​ కంటే 1000 రెట్లు వైరల్​ లోడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.