టీకా స్వీకరించినవారిలో ఒకరు మరణించినప్పటికీ బ్రెజిల్లో కరోనా వ్యాక్సిన్ చివరి విడత ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. మరణానికి టీకానే కారణమన్న విషయాలేవీ స్వతంత్ర దర్యాప్తులో తేలలేదని పేర్కొంది. నిర్దిష్ట సంఘటనలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని స్పష్టం చేసింది.
స్వతంత్ర దర్యాప్తు బృందంతో పాటు, బ్రెజిల్ రెగ్యులేటరీ ట్రయల్స్ కొనసాగించాలనే సిఫార్సు చేశాయని ఆక్స్ఫర్డ్ తెలిపింది.
సురక్షితమే
ఆక్స్ఫర్డ్ టీకా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ అంతా సవ్యంగానే జరుగుతున్నాయని.. వ్యాక్సిన్ సురక్షతపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టిన బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన బృందం పేర్కొంది. వైరస్ వ్యతిరేక పోరులో ఇదో శుభవార్త అని తెలిపింది. జన్యు సూచనలను టీకా పక్కా అనుసరిస్తోందని స్పష్టతనిచ్చింది.
ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి ఈ టీకాను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తోంది. అమెరికా, యూకే, బ్రెజిల్ తదితర దేశాల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఇదీ చదవండి- బ్రెజిల్లో కొవిడ్ టీకా వాలంటీరు మృతి!