ETV Bharat / international

వృద్ధుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతున్న ఆక్స్​ఫర్డ్​ టీకా!

author img

By

Published : Nov 19, 2020, 3:55 PM IST

ఆక్స్​ఫర్డ్​ టీకా వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నట్లు తేలింది. 56 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్కులైన ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వగా మంచి ఫలితాలు వచ్చినట్లు లాన్సెట్​లో కథనం ప్రచురితమైంది. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వ్యాక్సిన్​ తయారీ బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

Slug Oxford University COVID-19 vaccine encouraging for older age groups
'వృద్ధుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతున్న ఆక్స్​ఫర్డ్​ టీకా'

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం బృందాలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్..‌ ఆరోగ్య వంతులైన వృద్ధుల్లో వ్యాధినిరోధక శక్తిని బాగా పెంపొందిస్తోంది. 56 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్కులైన ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వగా మంచి ఫలితాలు వచ్చినట్లు లాన్సెట్​లో కథనం ప్రచురితమైంది. మొత్తం 560 మంది వృద్ధులైన ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వగా వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఆ అధ్యయనం వివరించింది.

యువకుల కంటే అధికంగా..

యువకుల కంటే వృద్ధుల్లోనే వ్యాధి నిరోధక శక్తి అధికంగా అభివృద్ధి అయినట్లు పేర్కొంది. కరోనా వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపడం సహా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వ్యాక్సిన్‌ తయారీ బృందంలోని డాక్టర్‌ మహేషి రామస్వామి చెప్పారు. ఇప్పటికే ఫైజర్‌, స్పుత్నిక్‌, మోడెర్నా వ్యాక్సిన్‌ల మూడో దశ ప్రయోగాల ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉండగా, ఆక్స్‌ఫర్డ్‌ టీకా సైతం ఆ జాబితాలో చేరింది.

ఇదీ చూడండి: క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.