ETV Bharat / international

'కొత్త' కరోనా పైనా ఆక్స్​ఫర్డ్ టీకా ప్రభావవంతం!

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కొవిడ్-19 వ్యాక్సిన్.. కొత్త రకం కరోనా స్ట్రెయిన్​ పైనా సమర్థవంతంగా పని చేస్తోందని బ్రిటన్​కు చెందిన మీడియా సంస్థ తెలిపింది. గురువారం నాటికి బ్రిటన్​లో ఈ వ్యాక్సిన్​కు అత్యవసర అనుమతి లభిస్తుందని పేర్కొంది.

author img

By

Published : Dec 27, 2020, 8:51 PM IST

Oxford/AstraZeneca vaccine should be effective against new variant: Report
'కరోనా స్ట్రెయిన్​ పైనా 'కొవిషీల్డ్​' అధిక ప్రభావం'

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్​' టీకా కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పైనా అధిక ప్రభావం చూపుతుందని బ్రిటన్​కు చెందిన మీడియా సంస్థ తెలిపింది. గురువారం లోపు యూకేలో ఈ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి​ అనుమతి లభిస్తుందని పేర్కొంది. ఈ టీకా ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి భారత్​కు చెందిన సీరం సంస్థ, ఆక్స్​ఫర్డ్​తో ఒప్పందం కుదుర్చుకుంది.

నిల్వ చేయటం సులభం..

మొదటగా అత్యవసరమైన దాదాపు కోటి మందికి ఈ వ్యాక్సిన్​ను అందిస్తామని బ్రిటన్​కు చెందిన ఓ అధికారి తెలిపారు. టీకా అనుమతి లభిస్తే స్ప్రింగ్​ సీజన్ లోపు పరిస్థితి కుదుటపడుతుందని వివరించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం వ్యాక్సిన్​ సత్ఫలితాలను ఇస్తోందని ఆస్ట్రాజెనెకా చీఫ్​ ఎగ్జిక్యూటివ్ పాస్కల్​ సోరియట్​ తెలిపారు. వ్యాక్సిన్​ ధర కేవలం రెండు పౌండ్లని, నిల్వచేయటం సులభమని వివరించారు. ఫైజర్ టీకాను మైనస్​ 70 డిగ్రీ సెల్షియస్​లో నిల్వ చేయాలని, ధర కూడా 15 పౌండ్లు ఉందని తెలిపారు.

ఆక్స్​ఫర్డ్ టీకా 95 శాతం ప్రభావం వంతంగా పనిచేస్తోంది తుదిఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పాస్కల్​ చెప్పారు. కరోనా తీవ్రత పెరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చే రోగులపై 100 శాతం సమర్థవంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.

కరోనా కొత్త రకం స్ట్రెయిన్​ కారణంగా బ్రిటన్​లో మళ్లీ లాక్​డౌన్​ విధించారు. ఈ కొత్త వైరస్​ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

ఇదీ చదవండి : 'కొవిషీల్డ్‌'కు ముందుగా మనదేశంలోనే అనుమతి!

ఇదీ చదవండి : యూకేలో ఆంక్షలు మరింత కఠినతరం

ఇదీ చదవండి : బ్రిటన్​లో 6 లక్షల మందికి టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.