ETV Bharat / international

ఈ నెలాఖర్లో ఆక్స్​ఫర్డ్​ టీకాకు అనుమతి!

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు బ్రిటన్​లో ఈ నెలఖర్లో అనుమతులు లభించనున్నాయని అక్కడి వార్తా సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది మొదట్నుంచి వ్యాక్సిన్​ పంపిణీ మొదలవుతుందని పేర్కొంది. బ్రిటన్​లో అనుమతి లభిస్తే ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్​పై నమ్మకం ఏర్పడుతుందని చెప్పింది.

Oxford/AstraZeneca vaccine set to clearance by year-end: Report
ఈ నెలాఖర్లో ఆక్సఫర్డ్​ టీకాకు అనుమతి!
author img

By

Published : Dec 19, 2020, 7:45 PM IST

Updated : Dec 19, 2020, 10:21 PM IST

ఆక్స్​ఫర్డ్ టీకా వినియోగానికి బ్రిటన్ ఔషధ, ఆరోగ్య నియంత్రణ సంస్థ(ఎంహెచ్​ఆర్​ఏ) ఈ నెలాఖర్లో అనుమతి ఇస్తుందని అక్కడి వార్తా సంస్థ 'ది డైలీ టెలిగ్రాఫ్'​ కథనం ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ సురక్షితం, ప్రభావవంతంగా పని చేస్తోందని తేలిన తర్వాత ఫలితాలను విశ్లేషించి అనుమతులు మంజూరు చేసే బాధ్యతను స్వతంత్ర సంస్థ ఎంహెచ్​ఆర్​ఐకు గత నెలలో ఇచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. తుది ఫలితాలను సోమవారం పొందిన తర్వాత డిసెంబర్​ 28 లేదా 29న ఆక్స్​ఫర్డ్ టీకా వినియోగానికి అనుమతిస్తామని ఎంహెచ్​ఆర్​ఏ అధికారిక వర్గాలు తెలిపినట్లు 'ది డైలీ టెలిగ్రాఫ్' పేర్కొంది.

ఆక్స్​ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాకు బ్రిటన్​లో అనుమతి లభిస్తే ప్రపంచ దేశాలకు దీనిపై నమ్మకం ఏర్పడుతుందని, భారత్​లో ఇప్పటికే 5 కోట్లకుపైగా ఈ టీకా డోసులు సిద్ధమయ్యామని వార్తా సంస్థ వివరించింది. భారత్​లో ఆక్స్​ఫర్డ్ టీకా ఉత్పత్తిని సీరం సంస్థ నిర్వహిస్తోంది.

బ్రిటన్​లో అనుమతుల లభిస్తే ఆక్స్​ఫర్డ్​ టీకా గేమ్​ ఛేంజర్ అవుతుందని అక్కడి అధికారులు అశిస్తున్నారు. ఈ టీకాను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. పంపిణీ కూడా సులభం అవుతుంది. మొదటి డోసు తీసుకున్న వారికి ఫైజర్​ టీకా రెండో డోసును 21 రోజుల తర్వాత ఇవ్వాలి. ఆక్స్​ఫర్డ్​ టీకా విషయంలో రెండు డోసుకు మధ్యలో 28 రోజులు అంతరం ఉండాలి.

ఆక్స్​ఫర్డ్​ టీకాకు అనుమతి మంజూరు ప్రక్రియ అనుకున్న సమయం కంటే ఆలస్యమైంది. విభిన్న వయస్కుల వారిలో టీకా ఫలితాలు భిన్నంగా ఉండటమే దీనికి కారణం. మొదటి డోసు ఇచ్చిన ఎక్కువ రోజుల తర్వాత రెండో డోసు ఇస్తే టీకా అధిక ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఎట్టకేలకు గుర్తించినందు వల్ల త్వరలోనే అనుమతి లభించనుంది.

Last Updated : Dec 19, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.