ETV Bharat / international

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ సక్సెస్​ రేటు 50%.. కారణమిదే! - ఆక్స్​ఫర్డ్ టీకా

భారీ సమూహాలపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ ఫలితాలు సంక్రమణ రేటుపై ఆధారపడి ఉంటుందని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ కారణం వల్లనే తాము రూపొందించిన వ్యాక్సిన్​ ప్రయోగాల్లో 50 శాతం ఫలితాలు రాకపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Oxford COVID-19
ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్
author img

By

Published : May 26, 2020, 6:19 AM IST

వ్యాక్సిన్​పై జరుగుతున్న ప్రయోగాల్లో ఎలాంటి ఫలితాలు రాకపోయే అవకాశాలు 50 శాతంగా ఉందని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సంక్రమణ రేటు క్షీణించటమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు.

10,260 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్​ పరీక్షలు నిర్వహిస్తామని ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గతవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫలితాల అంచనాపై స్పష్టతనిచ్చారు పరిశోధకులు.

వాలంటీర్లలో ఇన్పెక్షన్ల సంఖ్యతో వ్యాక్సిన్​ తీసుకున్న బృందంలోని ఇన్ఫెక్షన్ల సంఖ్యను పోల్చి కరోనాను ఈ టీకా నియంత్రించగలదో లేదో అన్న విషయాన్ని నిర్ధరిస్తామని తెలిపారు. ఇందుకోసం కొంతమంది వలంటీర్లకు కరోనా వైరస్​ సంక్రమించి ఉండాలని వెల్లడించారు.

"అవసరమైన సంఖ్యను మనం ఎంత త్వరగా చేరుకుంటాం అనేది సమాజంలో వైరస్ సంక్రమణపై ఆధారపడి ఉంటుంది. సంక్రమణ అధికంగా ఉంటే రెండు నెలల్లో టీకా పనిచేస్తుందో లేదో తెలుసుకోవటానికి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. వ్యాప్తి క్షీణిస్తే ఇందుకు 6 నెలల వరకు పట్టవచ్చు."

- ప్రొఫెసర్​ అడ్రియాన్​ హిల్​, జెన్నర్ ఇనిస్టిట్యూట్

ఈ కారణంగానే కరోనా సోకే అవకాశం అధికంగా ఉన్నవారినే వలంటీర్లుగా మొదటి ప్రాధాన్యం ఇస్తామని పరిశోధకులు తెలిపారు. ఇది కాలానికి వైరస్​ నియంత్రణకు పోటీ అని హిల్​ అంచనా వేశారు.

"కరోనాకు 80శాతం ప్రభావవంతమైన వ్యాక్సిన్​ను సెప్టెంబర్​కల్లా తయారు చేస్తామని ప్రారంభంలో చెప్పాం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అసలు ఎలాంటి ఫలితాలు దక్కకపోయే అవకాశం 50 శాతంగా ఉంది. అంటే 50 శాతం ఫలితాలు ఉండవు. 10 వేల మంది వాలంటీర్లలో 20 శాతం కన్నా తక్కువ మందికి పాజిటివ్​గా తేలితే వచ్చే ఫలితాలు నిరర్ధకం."

ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెన్నర్ ఇనిస్టిట్యూట్​ ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్​ను రూపొందించింది. అనంతరం దీనిని AZD1222 గా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.