ETV Bharat / international

6 నెలల్లోనే 5 లక్షలు పెరిగిన శరణార్థుల సంఖ్య

స్వదేశంలో నెలకొన్న అశాంతి, అంతర్గత సమస్యలకు కరోనా సంక్షోభం తోడవడం కారణంగా 2020 మధ్యకాలం నాటికి.. ప్రపంచవ్యాప్తంగా 80మిలియన్​కుపైగా మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది తొలినాళ్లలో ఈ సంఖ్య 79.5 మిలియన్​గా ఉందని పేర్కొంది.

Over 80 mn people forcibly displaced globally as of mid-2020, COVID further worsened crisis: UN
8కోట్ల మంది స్వస్థలాలను వీడారు: ఐరాస
author img

By

Published : Dec 10, 2020, 11:38 AM IST

2020 మధ్యకాలం నాటికి ప్రపంచవ్యాప్తంగా 80మిలియన్​కుపైగా మంది ప్రజలు వలసదారులుగా మారారని ఐరాస ఓ నివేదికను విడుదల చేసింది. గొడవలు, కరోనా సంక్షోభం వల్ల వీరందరూ బలవంతంగా తమ నివాసాలను వీడాల్సి వచ్చిందని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 2020 మధ్యకాలం నాటికి 80మిలియన్​ మంది వివిధ సమస్యలతో స్వస్థలాలను వీడి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. ఘర్షణలు, హింసకు తోడు కరోనా సంక్షోభం కూడా ప్రభావం చూపడం వల్ల వీరు బలవంతంగా వలసవెళ్లిపోయారని పేర్కొంది.

ఇదీ చూడండి:- 'భారత్​ నాయకత్వంలో ఆ లక్ష్యాలు సాధ్యమే'

ఈ ఏడాది ఆరంభంలో 79.5 మిలియన్​ మంది తమ నివాసాలను వీడినట్టు యూఎన్​హెచ్​సీఆర్​(శరణార్థుల ఏజెన్సీ) వెల్లడించింది. వీరిలో 30-34మిలియన్​ మంది 18ఏళ్లలోపు(2019 చివరి నాటికి) వారేనని తెలిపింది. విభేదాలు, మానవ హక్కుల ఉల్లంఘన, హింస ఉందుకు కారణంగా పేర్కొంది. వీరిలో.. అంతర్గత ఘర్షణల కారణంగా 45.7మిలియన్​ మంది శరణార్థులుగా మారినట్టు తెలిపింది. మరో 29.6 మిలియన్​ మంది విదేశాలకు వెళ్లిపోయారని స్పష్టం చేసింది.

సిరియా(6.6మిలియన్​), వెనుజువెలా(3.7మిలియన్​), అఫ్గానిస్థాన్​(2.7మిలియన్​), దక్షిణ సుడాన్​(2.3మిలియన్​), మయన్మార్​(1 మిలియన్​) ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది శరణార్థులు(3.6మిలియన్​) టర్కీలోనే ఉన్నట్టు యూఎన్​హెచ్​సీఆర్​ నివేదించింది. కొలంబియా(1.8మిలియన్​) ఆ తర్వాతి స్థానంలో ఉంది.

ఇదీ చూడండి:- 'బహిరంగంగా టీకా తీసుకునేందుకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.