ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి కొత్తరూపం 'స్ట్రెయిన్' విజృంభిస్తోంది. కొత్తగా ఎనిమిది ఐరోపా దేశాల్లో కొత్త కేసులు బయటపడిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఇంతకముందు కన్నా వేగంగా యువత ఈ వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా సంచాలకులు హాన్స్క్లూగ్ తెలిపారు. వైరస్ సోకకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. యువతలో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ తీవ్రత ఏ మేరకు ఉంటుందో పరిశోధించాల్సి ఉందన్నారు. గతవారం బ్రిచన్లో మొదటి స్ట్రెయిన్ కేసు నమోదైంది.
ఎనిమిది ఐరోపా దేశాల్లో కొత్తరకం కరోనా కేసులు నమోదయ్యాయి. సామాజిక దూరం, మాస్కుల ధారణ వంటివి ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలి.
-ట్విట్టర్లో హాన్స్క్లూగ్
ఇదీ చదవండి: అంబులెన్స్‌లో గుండె- 12నిమిషాల్లో 18కి.మీ ప్రయాణం