నెదర్లాండ్స్ వూర్తుయిజెన్ అనే ప్రాంతానికి చెందిన ఓ చెఫ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌ను రూపొందించాడు. దీని ధర 5వేల యూరోలు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 4,42,125. అందులో అంత ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా?
వూర్తుయిజెన్లోని డెల్టాన్స్ రెస్టారెంట్లో.. రాబర్ట్ జాన్ డే వీన్ అనే చెఫ్ ఈ బర్గర్‌ను రూపొందించాడు. దీనికి "ది గోల్డెన్ బాయ్" అని పేరు పెట్టాడు.
రెస్టారెంట్ ప్రకారం.. ఈ బర్గర్‌ను బెలుగా కావియర్, కింగ్ క్రాబ్, సాఫ్రాన్, వాగ్యూ బీఫ్, స్పానిష్ పలేటా ఇబెరికో, వైట్ ట్రఫల్, ఇంగ్లీష్ చెడ్డర్ చీస్‌తో తయారు చేశాడు రాబర్ట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ బీన్స్గా పేరొందిన కోపి లువాక్తో కూడిన బార్బెక్యూ సాస్‌ను ఇందులో కలిపాడు.
ఈ బర్గర్లో ఉపయోగించిన బన్ కుడా ప్రత్యేకమే! డోమ్ పెరిగ్నాన్ షాంపైన్‌తో ఈ బన్ను తయారు చేశారు.
మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఇంతటి ఖరీదైన బర్గర్‌ను కొన్నది ఎవరంటారా? నెదర్లాండ్స్‌కు చెందిన రెమియా ఇంటర్నేషనల్ సంస్థ ఈ బర్గర్‌ను కొనుగోలు చేసింది. రాయల్ డచ్ ఫుడ్ అండ్ బేవరేజ్ అసోసియేషన్ ఛైర్మన్ రాబర్ విల్లెమ్స్ దీనిని ఆరగించారు.
అయితే.. ఈ బర్గర్‌కు వచ్చిన డబ్బులను వీన్.. ఓ ఎన్జీఓకు ఇవ్వడం విశేషం.
ఇదీ చూడండి:- 'పాప్‌కార్న్ సలాడ్'.. ఇదేం ఐడియా తల్లీ!