పిల్లలపై ఒకవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి... మరోవైపు ర్యాంకుల బెడద. ప్రస్తుత విద్యా వ్యవస్థలో మనం చూస్తున్న పరిస్థితి ఇది. ఆస్ట్రేలియా పాఠశాలల్లో పిల్లలు చదువుకుంటున్న తీరు మాత్రం కాస్త భిన్నం. వారు ప్రకృతి ఒడిలో చేరి పాఠాలు నేర్చుకుంటున్నారు.
ఆస్ట్రేలియా టాస్మానియా రాష్ట్రం హోబర్ట్‌లోని డౌన్హామ్స్ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలంతా మట్టితో ఆటలాడుతున్నారు. వారంలో ఒకరోజు ఇంతే. గేమ్స్ డే, గార్డెనింగ్ డే తరహాలో బురద ఆటల రోజు. మట్టిలో సందడిగా గడుపుతారు. రకరకాల బొమ్మలు చేస్తారు.
బురదలో ఆటలు ఆడించడానికి ఓ పెద్ద కారణమే చెబుతారు ఉపాధ్యాయులు. పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇది సాయపడుతుందని అంటున్నారు. ఎప్పుడూ తరగతి గదుల్లో కాకుండా ప్రకృతితో గడపడం వల్ల వారు కష్టాలను ఎలా అధిగమించాలో నేర్చుకుంటారన్నది వారి మాట.
"మేము చాలా మంది ఉపాధ్యాయలను చూశాం. వారంతా పిల్లల్ని గమనిస్తూ, వారికి ఉన్న శక్తిసామర్థ్యాలను పరిశీలిస్తుంటారు. తరగతి గదిలో పిల్లల్లో చూడని నైపుణ్యాలను ఇక్కడ చూస్తుంటారు. ఇది నిజంగా చాలా మంచి పరిణామం."
-జెన్నీ డజ్యోన్, టాస్మానియా నేచర్ ప్లే నెట్వర్క్
ఇదీ చూడండి:గూగుల్ 'జాబిల్లి డూడుల్' అదుర్స్!