ETV Bharat / international

కరోనా కొత్త కేసుల్లో సగం ఐరోపా దేశాల్లోనే.. - బ్రెజిల్​లో కరోనా వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ పంజా విసురుతోంది. ఇప్పటివరకూ మొత్తంగా 5.61కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 13,46,753 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఐరోపాలో వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

CORONA_WORLD
కరోనా పంజా: రష్యాలో ఒక్కరోజే 20 వేల కేసులు
author img

By

Published : Nov 18, 2020, 10:06 PM IST

కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే, వైరస్​ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతుండటం సానుకూలాంశం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 13 లక్షల మందికిపైగా వైరస్​కు బలి కాగా.. కోటి 56 లక్షలకు పైగా యాక్టివ్​ కేసులున్నాయి. అమెరికా, భారత్​తో పాటు బ్రెజిల్​, ఫ్రాన్స్​, రష్యా, స్పెయిన్ దేశాల్లో కొవిడ్​ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది.

  • ఐరోపాలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా... గత వారం రోజుల్లో వైరస్​ వ్యాప్తి స్వల్పంగా అదుపులోకి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ చర్యల మూలంగానే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల్లో సగం ఐరోపాలోనివే.
  • రష్యాలో అత్యధికంగా ఒకే రోజు 20,985 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 34,387గా ఉంది.
  • ఇరాన్​లో తాజాగా 13,421 కొత్త కేసులు నమోదయ్యాయి. 480 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 8,01,894కు పెరిగి, మొత్తం మృతుల సంఖ్య 42,921కి చేరింది.
  • పొలాండ్​లో ఒక్కరోజే 19,883 మందికి వైరస్​ సోకింది. గడిచిన 24 గంటల్లో వైరస్​ కారణంగా 603 మంది మృతిచెందారు.

వివిధ దేశాల్లో కొవిడ్​ కేసులు ఇలా:

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా 11,703,3222,54,370
బ్రెజిల్ 5,911,758166,743
ఫ్రాన్స్2,036,75546,273
రష్యా1,991,99834,387
స్పెయిన్ 1,535,05841,688
బ్రిటన్1,410,73252,745
అర్జెంటినా 1,329,00536,106
ఇటలీ 1,238,07246,464
కొలంబియా1,211,12834,381
మెక్సికో1,011,15399,026

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.