కొత్త రకం కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు విధించిన ఆంక్షలను.. యూకే శనివారం మరింత కఠినతరం చేసింది. ఉత్తర ఐర్లాండ్‌లోని.. వేల్స్‌లో ఆరువారాల పాటు లాక్‌డౌన్ విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలను లండన్‌తో పాటు.. దాని పరిసర ప్రాంతాలకు విస్తరించటంతో, మరో 6 మిలియన్ల ప్రజలు తాజాగా ఆంక్షల పరిధిలోకి చేరారు.
నిబంధనలు కఠినం..
అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతించిన ప్రభుత్వం.. జిమ్‌లు ఈతకొలనులు, సెలూన్లు, అత్యవసరం కాని వస్తువులమ్మే దుకాణాలను మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్‌లో క్రిస్మస్ రోజున 32వేల 700 కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది.
ఆ దేశాల్లోనూ..
ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు సైతం కొత్త రకం వైరస్ పాకింది. ఈ నెల 19న ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్‌కి వచ్చిన ప్రయాణికుడిని వైద్యులు పరీక్షించగా పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజలంతా కొత్త రకం వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి: ఎనిమిది ఐరోపా దేశాలకు పాకిన స్ట్రెయిన్