ETV Bharat / international

నీరవ్​ మోదీకి ఏడోసారి బెయిల్​ నిరాకరణ

author img

By

Published : Oct 26, 2020, 8:26 PM IST

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13వేల కోట్ల రుణాలను ఎగవేసి లండన్​కు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీకి మరోసారి చుక్కెదురైంది. లండన్​లోని వెస్ట్​మినిస్టర్ న్యాయస్థానం ఆయనకు మరోసారి బెయిల్​ నిరాకరించింది.

London court rejects Nirav Modi's bail application for seventh time
నీరవ్​ మోదీకి ఏడోసారి బెయిల్​ నిరాకరణ

పరారీలో ఉన్న రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టు మళ్లీ షాకిచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం కొట్టేసింది. పంజాబ్​ నేషనల్​ బ్యాంకుంలో రూ. 13 వేల కోట్ల రుణ ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసులో నీరవ్​ను భారత్​కు అప్పగించే అవకాశాల నేపథ్యంలో బెయిల్ నిరాకరించింది కోర్టు.

కేంద్ర దర్యాప్తు సంస్థ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్రిటన్​కు చెందిన క్రౌన్ ప్రాసెక్యూషన్​ సర్వీసుల సమన్వయంతోనే పదేపదే నీరవ్​ బెయిల్ దరఖాస్తును ధర్మాసనం తిరస్కరిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

గతంలో నీరవ్​ బెయిల్​ను నాలుగుసార్లు తిరస్కరించింది లండన్​లోని వెస్ట్​మినిస్టర్ జిల్లా న్యాయస్థానం. తర్వాత లండన్ హైకోర్టు రెండు దఫాలు బెయిల్ పిటిషన్​ను కొట్టివేసింది. తాజాగా వెస్ట్​మినిస్టర్ న్యాయస్థానం ఏడోసారి తిరస్కరించింది.

ఇదీ చూడండి: 'స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ యుద్ధం చేయదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.