ETV Bharat / international

కరోనా ఉగ్రరూపం- 6 లక్షలకుపైగా కేసులు

చైనాలో మొదలైన కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 6 లక్షల మందికిపైగా ఈ వైరస్​ బారిన పడ్డారు. ఒక్క ఇటలీలోనే అత్యధికంగా 10 వేల మందికిపైగా మరణించారు. మున్ముందు పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Italy, Spain suffer record virus deaths as infection rate surges
కేసులు పెరుగుతూ పోతే.. మరిన్ని మరణాలు తప్పవు
author img

By

Published : Mar 28, 2020, 3:55 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 6 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. వైరస్​ కారణంగా ఎక్కువ మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది ఇటలీ. ఇప్పటివరకు ఆ దేశంలో 10వేల మందికిపైగా మృతి చెందారు. ఒక్క ఐరోపాలోనే ఏకంగా 3లక్షల మందికిపైగా ఈ మహమ్మారి సోకింది.

ఇటలీలో ఒక్క శుక్రవారమే దాదాపు 1000 మంది మృతి చెందారు. ఆ దేశంలో వైరస్ విజృంభిస్తోందని జాతీయ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు సిల్వియో బ్రూసాఫెరో ఆందోళన వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో ఈ ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని హెచ్చరించారు. స్పెయిన్​లోనూ కొత్తగా నమోదవుతున్న వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి అలా కనిపించడం లేదు.

న్యూయార్క్​లో అధిక కేసులు...

ప్రపంచంలో అత్యధిక(లక్షకుపైగా) కేసులు నమోదైన దేశంగా నిలిచింది అమెరికా. ముఖ్యంగా న్యూయార్క్​లో వైరస్​ తీవ్ర ప్రభావం చూపుతోంది.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా సహాయ చర్యలు ముమ్మరం చేసింది అగ్రరాజ్యం. ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం కోసం ట్రంప్​ యుద్ధ సమయంలో అమలు చేసే చట్టం కింద ఓ ప్రైవేటు కంపెనీకి వెంటిలేటర్లు తయారు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దేశంలో 60 శాతం లాక్​డౌన్​ విధించారు.

ఆ ఖండానికీ తప్పని లాక్​డౌన్​..

ఆఫ్రికాలోనూ కరోనా ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికాలో ఇద్దరు మరణించారు. వైరస్​ వ్యాప్తి కారణంగా అక్కడి ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది.

పాక్​లో అమాంతం పెరుగుతోన్న కేసులు​

పాకిస్థాన్​లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. శనివారం నాటికి 11 మరణాలు... 1,408 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ముఖ్యంగా పంజాబ్​లో 490 మందికి మహమ్మారి సోకింది. సింధ్​ రాష్ట్రంలో 457 కేసులు నిర్ధరణ అయ్యాయి. వీరిలో ఎక్కువగా వైరస్​ ప్రభావిత దేశమైన ఇరాన్​ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

చైనాలో భిన్నం

కరోనా సంక్షోభం నుంచి చైనా కోలుకుంటోంది. జనవరి నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. శనివారం నుంచి బయట తిరిగేందుకు అనుమతించింది ప్రభుత్వం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.