కరోనా సంక్షోభంతో బ్రిటన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు.... సాయం కోసం ప్రధానిని అభ్యర్థించారు. ప్రత్యేక విమానం ద్వారా తమను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని కోరారు. బ్రిటన్లో ఉన్న విద్యార్థులు మొత్తం ఒక బృందంగా ఏర్పడి పాస్పోర్టు, ఇతర వివరాలను భారత ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
"మా పరీక్షలు మార్చి 23, 24 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తితో వాటిని వాయిదా వేశారు. అప్పటికే భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయును స్వదేశానికి తీసుకొని వస్తున్నారని మాకు తెలుసు. కానీ మేము ఇక్కడే ఉండిపోయాము. మా గురించి ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదు మోదీజీ."
-అఖిల్, ఇంజినీరింగ్ విద్యార్థి.
కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది బ్రిటన్లో చిక్కుకు పోయినట్లు తెలిపారు విద్యార్థులు. అక్కడి ప్రభుత్వం వీసా గడువును పొడిగించినప్పటికీ.... నిత్యావసరాల కొరత ఉందని, తమ దగ్గర డబ్బులు కూడా తక్కువగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:కోరలు చాచిన కరోనా- దేశంలో మరో ఇద్దరు మృతి