ETV Bharat / international

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంపై తాలిబన్ల షాకింగ్ కామెంట్స్ - రష్యా వ్యాపారాలు

Russia-Ukraine War Crisis: ఉక్రెయిన్​పై సైనిక చర్యలు పాల్పడిన రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్​ దేశాలు. రష్యాను అదుపు చేసేందుకు ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. మరోవైపు.. రష్యా చర్యను ఖండిస్తూ తీర్మానం చేసేందుకు ఐరాస భద్రతా మండలి శుక్రవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ క్రమంలోనే రష్యా-ఉక్రెయిన్​ పరిణామాలపై తాలిబన్లు కీలక ప్రకటన చేశారు.

author img

By

Published : Feb 25, 2022, 6:29 PM IST

Russia-Ukraine War Crisis: ఉక్రెయిన్​పై బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. ఆ దేశ రాజధాని కీవ్​ను స్వాధీనం చేసుకునేందుకు వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​ సహా కీలక నేతలపై చర్యలకు ఉపక్రమించారు ప్రపంచ నేతలు. పుతిన్​, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తులు ఫ్రీజ్ చేయాలని ఈయూ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. తీవ్రమైన ఆంక్షలకు జపాన్​, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్​ సహా పలు దేశాలు సిద్ధమయ్యాయి. రష్యా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్​ సహా దాని యూరోపియన్​ మిత్రదేశాలు.. మాస్కోపై తీవ్రమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమాన్యూయెల్​ మేక్రాన్​ పేర్కొన్నారు.

రష్యా బ్యాంకులు, ఇతర కీలక సంస్థలపై ఆంక్షలు విధించటంలో ఐరోపా సమాఖ్య, అమెరికాకు ఆసియా పిసిఫిక్​లోని పలు​ దేశాలు తోడయ్యాయి. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపు చేసే లక్ష్యంతో సెమీకండక్టర్లు, ఇతర హైటెక్​ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. రష్యా బృందాలు, బ్యాంకులు, వ్యక్తుల వీసాలను నిలిపివేయటం సహా ఇతర కఠిన ఆంక్షలు ప్రకటించిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా. బలగాలతో ఏ దేశం సరిహద్దులను మార్చాలని చూసినా ఊరుకోబోమని స్పష్టం చేశారు. రష్యా చర్య కేవలం ఐరోపానే కాక ఆసియాపైనా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్​కు భారీ సాయం..

రష్యాపై విధించాల్సిన ఆంక్షలకు తుదిరూపు ఇచ్చిన ఐరోపా సమాఖ్య.. వాటి ఆమోదం కోసం శుక్రవారం.. సభ్య దేశాల విదేశాంగ మంత్రుల ముందుకు పంపించింది. అలాగే.. 1.5 బిలియన్​ యూరోలు(1.68బిలియన్​ డాలర్లు) సాయాన్ని ఉక్రెయిన్​కు అందించేందుకు ఐరోపా సమాఖ్య నిర్ణయించినట్లు ఫ్రాన్స్​ అధ్యక్షుడు మేక్రాన్​ తెలిపారు.

ఉక్రెయిన్​లో ఐక్యరాజ్య సమితి మానవతా సహాయ కార్యక్రమాల కోసం మరో 20మిలియన్ల డాలర్లు అందించాలని ఐరాస నిర్ణయించింది. యూఎన్​ సెంట్రల్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ ఫండ్​ ద్వారా తూర్పు డొనెట్స్క్​, లుహాన్స్​ సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అత్యవసర కార్యకలాపాలు, యుద్ధం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ప్రజల ఆరోగ్యం, ఆశ్రయం​, ఆహారం, నీరు, పరిశుభ్రతకు ఉపయోగపడతాయని యూఎన్​ హ్యూమనేటిరియన్​ చీఫ్​ మార్టిన్​ గ్రిఫిత్స్​.

విమానాలపై నిషేధం..

రష్యా విమానయాన సంస్థ ఎయిరోఫ్లోట్​ విమానాలపై బ్రిటన్​ నిషేధం విధించిన క్రమంలో ప్రతీకార చర్యలు చేపట్టంది రష్యా. యూకే విమానాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. తమ గగనతలం వినియోగించుకోకుండా చర్యలు తీసుకుంది.

రష్యా సరఫరా గొలుసుపై ప్రభావం..

ఉక్రెయిన్​పై సైనిక చర్య చేపట్టిన క్రమంలో రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలతో కీలకమైన సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యక్షుడు పుతిన్​కు వివరించింది ఆ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమాఖ్య. దేశంలోని వ్యాపారవేత్తలతో గురువారం సమావేశమయ్యారు పుతిన్​. ఈ సందర్భంగా కొత్త ఆంక్షలతో సరఫరా గొలుసు దెబ్బతింటుందని పుతిన్​కు వివరించారు. అలాగే.. ఆర్థిక రంగం, భారీ పరిశ్రమలు, సాంకేతిక సామగ్రి సరఫరా వంటివాటిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. అయితే, ఇతర భాగస్వామ్య పార్టీలపై దృష్టి సారించనున్నామని, తమతో కలిసివచ్చే దేశాలతో వ్యాపారాలు ప్రారంభిస్తామని భరోసా కల్పించినట్లు సమాచారం

ఐరాస భద్రతా మండలి తీర్మానం..

రష్యా చర్యను ఖండించటం, ఉక్రెయిన్​ నుంచి వెంటనే బలగాలను ఉపసంహరించటంపై తీర్మానం చేసేందుకు శుక్రవారం ఐరాస భద్రతా మండలి ఓటింగ్​ నిర్వహిచనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఈ ఓటింగ్​ ప్రక్రియ ఉండనుంది. ముసాయిదా తీర్మానం ద్వారా రష్యా చర్యను తీవ్రంగా వ్యతిరేకించాలని భావిస్తోంది ఐరాస.

భారత్​ మద్దతుపై రష్యా ధీమా..

ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెడితే.. భారత్​ నుంచి మద్దతు ఉంటుందని భావిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్​లో ప్రస్తుత పరిస్థితులు తలెత్తేందుకు గల లోతైన కారణాలు భారత్​కు తెలుసునని రష్యా విదేశీ వ్యవహారాల ఇంఛార్జ్​ రోమన్​ బాబుష్కిన్​ పేర్కొన్నారు. భారత్​ నుంచి మద్దతు కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్​ అవలంబిస్తున్న వైఖరిని ప్రశంసించింది రష్యా. మూడు రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ వ్యాఖ్యలను గుర్తు చేసింది.

తాలిబన్ల కీలక ప్రకటన..

ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యకు పాల్పడిన క్రమంలో కీలక ప్రకటన చేశారు తాలిబన్లు. రెండు పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. అలాగే.. హింసాత్మక ఘటనలు పెంచే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.

ఇదీ చూడండి: ఆ 27 దేశాలను నమ్మి ఉక్రెయిన్​ మోసపోయిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.