ఫ్రాన్స్ పార్లమెంట్లో పాక్ అక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ప్రసంగించకుండా అడ్డుకుంది భారత్. మసూద్‌ను ఫ్రాన్స్ లోక్‌సభలో మాట్లాడించేందుకు పాక్ దౌత్య బృందం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారత్ దౌత్య బృందం ఫ్రాన్స్ విదేశాంగ శాఖకు హెచ్చరిక చేసింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమైనందున పీఓకే అధ్యక్షుడి ప్రసంగానికి అనుమతి ఇవ్వడం భారత సార్వభౌమాధాకారాన్ని ప్రశ్నించడమే అవుతుందని పేర్కొంది. మసూద్‌కు వ్యతిరేకంగా సంతకాల చేసి ప్రవాస భారతీయులు తమ నిరసన వ్యక్తం చేశారు.
ఐరాస భద్రతా మండలిలో జైషే మహ్మద్ అధినేత మసూద్ ఆజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటానికి ఫ్రాన్స్ కృషి చేసింది. తాజా ఘటనతో పాక్‌కు మరో భంగపాటు ఎదురైనట్లు అయింది.
కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికపై తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ అంతర్జాతీయ సమాజం పాక్ వాదనను పట్టించుకోవడం లేదు.
ఇదీ చూడండి : కశ్మీర్ సహా పలు అంశాలపై పాంపియో-జైశంకర్ చర్చ