కరోనా వైరస్ రెండో దశ విజృంభణతో దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు పలు దేశాలు సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో జర్మనీ చేరింది. ఈ మేరకు ఆ దేశం అందించిన నాలుగు ఆక్సిజన్ కంటైనర్లను ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి తీసుకొచ్చినట్లు భారత వైమానిక దళం ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతేకాకుండా.. బ్రిటన్‌లోని బ్రైజ్ నార్టన్ నుంచి 450 ఆక్సిజన్ సిలిండర్లను తమిళనాడులోని చెన్నై వాయు స్థావరానికి తరలించినట్లు వెల్లడించింది. ఇందుకుగాను సీ-17 విమానాన్ని ఉపయోగించింది ఐఏఎఫ్.
అలాగే భారత్‌లోనూ ఆక్సిజన్ సరఫరాకు ఆదివారం పలు విమానాలను పంపినట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ఛండీగఢ్‌కు రెండు, జోధ్‌పూర్-జామ్‌నగర్, దిల్లీ-రాంచీ, ఇందోర్-జామ్నగర్ల మధ్య రెండు చొప్పున క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు సరఫరా చేసినట్లు తెలిపింది.
కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ పంపిణీని వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 23 నుంచి నిరంతరాయంగా సేవలందిస్తోంది ఐఏఏఫ్. మెడికల్ ఆక్సిజన్‌తో పాటు.. కొవిడ్ ఆసుపత్రులకు అత్యవసర ఔషధాలతో పాటు.. అవసరమైన పరికరాలను సరఫరా చేస్తోంది.
ఇవీ చదవండి: బ్రిటన్ నుంచి భారత్‌కు మరో 1000 వెంటిలేటర్లు