ETV Bharat / international

పోషకాహార లోపంతో భారీగా చిన్నారుల మరణాలు! - malnourished

పోషకాహార లోపంతో లక్షా 68 వేల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. స్టాండింగ్​ టుగెదర్ ఫర్​ న్యూట్రిషన్​ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఇందుకు సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి.

Hunger study predicts 168,000 pandemic-linked child deaths
పోషకాహారలోపంతో భారీగా చిన్నారుల మరణాలు!
author img

By

Published : Dec 16, 2020, 10:47 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఈ ప్రభావం బాలబాలికల పోషకాహార లోపంపై పడింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 68 వేల మంది పోషకాహార లోపంతో మరణించే అవకాశం ఉన్నట్లు 30 అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన అధ్యయనం వెల్లడించింది. 'స్టాండింగ్ టుగెదర్ ఫర్ న్యూట్రిషన్' అనే సంస్థ చేపట్టిన ఈ ఫోన్​ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

సర్వే వివరాలు ఇలా..

  • సుమారు కోటీ 19 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఇందులో ఎక్కువ భాగం దక్షిణ ఆసియా, ఆఫ్రికాల్లోనే ఉన్నారు.
  • అప్పుడే పుడుతున్న చిన్నారుల్లో కూడా పోషకాహార లోపం ఉంటుంది. దీని వల్ల ఓ తరం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తోంది.
  • కరోనావైరస్​కు ముందు ప్రపంచ దేశాలు పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడి అనూహ్య విజయం సాధించాయి.
  • 2000 సంత్సరంలో 199.5 మిలియన్ల మంది బాధితులు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 144 మిలియన్లకు తగ్గింది.
  • గతేడాదిలో నమోదైన కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా.
  • పోషకాహార లోపానికి వ్యతిరేకంగా భారీగా నిధులు సేకరించడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 300 కోట్లు సేకరించారు.
  • ప్రపంచంలో పోషకాహారలోపం ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్​ ముందుంది.
  • పోషకాహారలోపాన్ని అరికట్టే దిశగా 2025 నాటికి రూ. 220 కోట్ల ఖర్చు చేయనున్నట్లు వెల్లడి.

ఇదీ చూడండి: అమెరికాలో టీకా పంపిణీ షురూ- ట్రంప్​ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.