ETV Bharat / international

హైహీల్స్​లో స్వలింగ సంపర్కుల పరుగు పందెం!

సాధారణ పరుగు పందేలు అందరూ చూసి ఉంటారు. కానీ స్పెయిన్​లో ఓ స్వలింగ సంపర్కుల సంఘం మాత్రం కాస్త విభిన్నంగా ప్రయత్నించింది. 20 ఏళ్లుగా సాగుతున్న స్వలింగ సంపర్కుల ఆత్మగౌరవ ఉత్సవాల్లో భాగంగా.. సభ్యులు 'హైహీల్స్ పరుగు పందెం' నిర్వహించుకుని ఆనందించారు.

హైహీల్స్​లో స్వలింగ సంపర్కుల పరుగు పందెం!
author img

By

Published : Jul 6, 2019, 2:04 PM IST

హైహీల్స్ వేసుకుని స్వలింగ సంపర్కుల పరుగు
15 సెంటీమీటర్లకు మించిన హైహీల్స్ వేసుకుని, వీధుల్లో పోటీ పడి పరుగులు తీశారు మాడ్రిడ్ స్వలింగ సంపర్కుల సంఘం సభ్యులు. స్పెయిన్​లో 20 ఏళ్లుగా కొనసాగుతున్న స్వలింగ సంపర్కుల ఆత్మగౌరవ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈసారీ విగ్గులు, వింత దుస్తులు ధరించి 'గే'లందరూ సందడి చేశారు. హై హీల్స్​ రేస్​లో గెలిచిన వారికి 350 యూరోలు అంటే సుమారు 27 వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు.

"ఇది ఈ ప్రాంతపు పండుగ.. లెవపీస్​, లా లాటినా ప్రాంతాల్లో ఇలాంటి పండుగలున్నాయి.
-చెమా, బార్​ నిర్వాహకుడు.

ఈ 'గే' పండుగ వీధుల్లో ప్రజలకు ఆటంకం కలగకుండా నగరానికి దూరంగా జరుపుకోవాలని స్థానిక అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కానీ ఆ పండుగను చూసేందుకు వచ్చే వీక్షకులు మాత్రం వీధుల్లో జరిగితేనే సందడిగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

"ఈ ఉత్సవాలను నగరానికి దూరంగా ఉంచమనడంలో అర్థంలేదు. వీధుల్లో జరపడమే మంచి ఆలోచన. చూడండి వీధుల్లో ఈ వేడుక వల్ల ఎంత మంది వ్యాపారులు లాభం పొందుతున్నారో. మరెందుకు ఉత్సవాలను బయటెక్కడికో తరలించడం?" -బిల్లీ, వీక్షకుడు.

ఇదీ చూడండి:'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ

Varanasi (UP), July 06 (ANI): Preparations underway to welcome Prime Minister Narendra Modi in Uttar Pradesh's Varanasi on Saturday. PM Modi will unveil statue of former Prime Minister of India Lal Bahadur Shastri. Later, he will also launch a tree plantation drive after unveiling the statue. PM Modi will also launch the BJP's membership drive in Varanasi.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.