యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌కు '2020 నోబెల్ శాంతి పురస్కారం' అందించాలని స్వీడన్ చట్టసభ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆమె పేరును ప్రతిపాదిస్తూ.. నార్వే నోబెల్ కమిటీకి ఇద్దరు స్వీడన్ ఎంపీలు లేఖ రాశారు. పర్యావరణంపై ప్రపంచ నేతల కళ్లు తెరిపించేందుకు థన్‌బర్గ్ వయసుకు మించి విశేషకృషి చేసిందని లేఖలో పేర్కొన్నారు. అందుకే నోబెల్ శాంతి పురస్కారానికి ఆమె అన్నివిధాల అర్హురాలని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకై థన్‌బర్గ్ చేసిన కృషికి 2019లోనే ఈమెకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని భావించారు. కానీ, సరిహద్దు దేశం ఎరిట్రియాతో దశాబ్దాలుగా ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కారం చూపినుందుకు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ను వరించింది.
ఇదీ చూడండి: 30వేల మంది అమ్మాయిలను మోసగించిన జపాన్ కుబేరుడు!