ప్రపంచ వ్యాప్తంగా.. హెచ్ఐవీ, వైరల్ హైపటైటిస్, సాంక్రమిక లైంగిక వ్యాధులతో ఏటా 23 లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. ప్రతిరోజు 10 లక్షల మంది ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నట్లు పేర్కొంది. వైరల్ హైపటైటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వాటిలో ఒకటిగా పరిణమించిందని.. దీనివల్ల తలెత్తే లివర్ క్యాన్సర్, సిరోసిస్ కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నట్లు తెలిపింది.
'గ్లోబల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ హెచ్ఐవీ, వైరల్ హైపటైటిస్ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్-2021' పేరిట రూపొందించిన ఈ నివేదికలో పలు కీలకాంశాలను వెల్లడించింది.
ఇదీ చూడండి: 'ఈ సెన్సార్‌తో క్షణంలో కరోనా ఫలితం'
ఇదీ చూడండి: 'బి.1.617.2 వైరస్ అత్యంత ప్రమాదకరం కాకపోవచ్చు'