ETV Bharat / international

ప్రపంచ మీడియాలో 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​కు పెద్దపీట - దిశ కేసు తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన 'దిశ' హత్యాచార కేసు నిందితుల ఎన్​కౌంటర్​ను ప్రపంచ మీడియాలో సైతం పతాక శీర్షికల్లో చేర్చారు. కేసు పూర్వ పరాలను సమగ్రంగా ప్రచురించాయి పలు వార్తా సంస్థలు.

ENCOUNTER
ప్రపంచ మీడియాలోనూ ప్రముఖంగా 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​
author img

By

Published : Dec 7, 2019, 6:22 AM IST

Updated : Dec 7, 2019, 6:35 AM IST

హైదరాబాద్​ యువ వైద్యురాలు 'దిశ' అత్యచారం, హత్య కేసులో నిందితుల ఎన్​కౌంటర్​కు ప్రపంచ మీడియా ప్రముఖంగా కవరేజీని ఇచ్చింది. ప్రధానంగా ప్రజలు మద్దతు తెలపడం.. సామాజిక కారక్యకర్తలు, న్యాయకోవిదుల అభిప్రాయాలను ఎత్తి చూపించాయి పలు వార్తా సంస్థలు.

అమెరికా పత్రికలు..

వాషింగ్టన్‌ పోస్ట్‌: మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. నిందితుల ఎన్‌కౌంటర్‌పై భారత్‌లో సర్వత్రా హర్షం వ్యక్తమైనట్లు పేర్కొంది. అయితే పోలీసులు న్యాయపరిధిని దాటి ‘ఎన్‌కౌంటర్‌’ చేశారంటూ సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు అభిప్రాయపడినట్లు కథనంలో ప్రచురించింది.

న్యూయార్క్‌ టైమ్స్‌: ఈ హఠాత్పరిణామం షాక్‌కు గురి చేసిందంటూ.. పోలీసు అధికారులు హైదరాబాద్‌లో హీరోలుగా ప్రశంసలు పొందుతున్నట్లు పేర్కొంది.
సీఎన్‌ఎన్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనను మ్యాప్‌లో చూపించింది. దిశపై దారుణం అనంతరం వెల్లువెత్తిన ఆందోళనలను ప్రస్తావించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పేర్కొంది.

హఫింగ్టన్‌పోస్ట్‌: 2008లో సజ్జనార్‌ వరంగల్‌ ఎస్పీగా ఉన్న సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పోలుస్తూ కథనం ఇచ్చింది. అప్పట్లో దుండగులు జరిపిన ఆమ్లదాడిలో గాయపడిన ప్రణీత (అమెరికాలోని డెన్వర్‌లో నివసిస్తున్నారు)తో కొద్ది రోజుల క్రితం చేసిన ముఖాముఖిని ఈ సందర్భంగా ప్రచురించింది.

సీబీఎస్‌ న్యూస్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనను ప్రముఖంగా ఇచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను ప్రచురించింది. భారత్‌లో 2017లో 33 వేలకు పైగా అత్యాచారాలు జరిగిన అంశాన్ని ప్రస్తావించింది.

యూఎస్‌ఏ టుడే: దేశవ్యాప్తంగాను, ప్రధానంగా హైదరాబాద్‌లో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

బ్రిటిష్‌ మీడియా..

బీబీసీ: ఎన్‌కౌంటర్‌పై సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకొంటున్నట్లు పేర్కొంది. పోలీసులను చాలామంది ప్రశంసిస్తున్నట్లు తెలిపింది. సత్వర న్యాయం జరిగిందని భావించడమే ఈ సంబరాలకు కారణంగా పేర్కొంది. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మహిళపై నేరాలు ఆగడం లేదని పేర్కొంది.

ది గార్డియన్‌: దిశపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనట్లు తెలపింది. ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం జరిగిందంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్న విమర్శలొస్తున్నట్లు కథనంలో పేర్కొంది.

ఖలీజ్‌ టైమ్స్‌ (దుబాయ్‌): ఎన్‌కౌంటర్‌పై ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. న్యాయం జరిగిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలిపింది.
ది టెలిగ్రాఫ్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనను, పూర్వాపరాలను ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో దీనిపై హర్షం వ్యక్తమైనట్లు పేర్కొంది. కొందరు రాజకీయ నాయకులు, హక్కుల సంఘాలు మాత్రం దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నట్లు కథనం రాసింది. యూకేకు చెందిన ‘ది టైమ్స్‌’ కూడా ఈ ఘటనను ప్రముఖంగా ఇచ్చింది.

అల్‌జజీరా: ఖతారీ మీడియా అల్‌జజీరా ఎన్‌కౌంటర్‌ ఘటనపై వార్త ఇస్తూ భారత్‌లో పోలీసులు చేస్తున్న పలు ‘ఎన్‌కౌంటర్ల’పై విమర్శలొస్తున్నట్లు పేర్కొంది. ఎన్‌కౌంటర్‌పైనా, అనంతర పరిణామాలపైనా, ప్రజల సంబరాలు చేసుకొన్న విషయమై ‘గల్ఫ్‌ న్యూస్‌’ అనేక చిత్రాలతో వార్తలందించింది.

ఇదీ చూడండి:మృత్యువుతో పోరాడుతూ ఉన్నావ్​ ఘటన బాధితురాలు మృతి

RESTRICTION SUMMARY: KABC - MUST CREDIT KABC; NO ACCESS LOS ANGELES;  NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KABC - MUST CREDIT;  NO ACCESS LOS ANGELES;  NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
Malibu, California - 6 December 2019
1. Aerial views of red vehicle at bottom of a cliff
2. Aerials wide view of Los Angeles County rescue helicopter over accident scene
3. Various aerials of accident scene and emergency crews
4. Wide to close aerial view of red vehicle at bottom of the cliff
5. Wide aerial view of fire department emergency vehicles parked top of the cliff
6. Various aerial views of victim hoisted to safety by Los Angeles County rescue helicopter
STORYLINE:
A 42-year-old female driver went over the side of a cliff near Mulholland Highway and Encinal Canyon in Malibu Friday morning.
According to the Los Angeles County Fire Department the driver was airlifted to a local hospital with minor injuries.
No other details have been released at this time.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 7, 2019, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.