ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 15 వేలు దాటిన కరోనా మృతులు - global-death-toll-from-coronavirus-passes-15000

రోజురోజుకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా 15 వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి ఇప్పటివరకు 174 దేశాలకుపైగా విస్తరించగా 3,41,300 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెట్​ఓ) స్పష్టం చేసింది.

global-death-toll-from-coronavirus-passes-15000
ప్రపంచ వ్యాప్తంగా 15 వేలకు దాటిన కరోనా మృతులు
author img

By

Published : Mar 23, 2020, 8:26 PM IST

Updated : Mar 23, 2020, 8:48 PM IST

మహమ్మారి కరోనా ధాటికి ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. రోజురోజుకూ ఈ కేసులు అధికంగా నమోదవుతుండగా ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 15,189 మంది ఈ వైరస్​ సోకి మృతి చెందారు. 174 దేశాల్లో 3,41,300 మందికి ఈ మహమ్మారి సోకింది. చాలా దేశాలు కొవిడ్​-19కు విరుగుడు కనుగొనేందుకు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆయా దేశాల్లో ఇలా..

స్పెయిన్​లో 24 గంటల్లో 462 మంది మృతి

స్పెయిన్​లో ఒక్కరోజే 462 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 2,182 మంది మృత్యువాత పడ్డారు. 33,089 కేసులు నమోదయ్యాయి. దీంతో స్పెయిన్ వ్యాప్తంగా ఏప్రిల్​ 11 వరకు లాక్​డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వీరిలో 3,910 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

యూరప్​లో ఇప్పటివరకు 1,72,238 కేసులు నమోదవగా 9,197 మంది మృతి చెందారు. ఆసియాలో 97,783 కేసులు, 3,539 మరణాలు చోటుచేసుకున్నాయి. అమెరికా, కెనడాల్లో 490 మంది మరణించారు. మొత్తం 36,554 కేసులు నమోదయ్యాయి.

ఇరాన్​ @ 127

ఇరాన్​లో తాజాగా 127 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,812కు చేరుకుంది. ఇప్పటివరకు 23,049 కేసులు నమోదయ్యాయి.

చైనాలో..

హాంకాంగ్​, మకావ్​లను మినహాయించగా చైనాలో ఇప్పటివరకు 81,093 కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,270 మంది మృతి చెందారు. 72,703 మంది కోలుకోగా.. 39 కొత్త కేసులు, తొమ్మిది కొత్త మరణాలు నమోదయ్యాయి.

ఇటలీలో..

ఫిబ్రవరిలో మొట్టమొదటి కరోనా మరణాన్ని నమోదు చేసుకున్న ఇటలీలో ఇప్పటివరకు 5,476 మంది మరణించారు. 59,138 మందికి వైరస్​ సోకగా 7,024 మంది ఆరోగ్యం మెరుగుపడింది.

దక్షిణాఫ్రికాలో

దక్షిణాఫ్రికాలో కరోనా బారిన 402 మంది పడగా మరణాలు సంభవించలేదు.

ఇక్కడ మొదటి మరణాలు

నైజీరియా, మాంటెనెగ్రో దేశాల్లో మొదటి కరోనా మరణాలు సంభవించాయి. నైజీరియాలో ఇప్పటివరకు 36 కేసులు నమోదయ్యాయి. పపువా న్యూగినియా, సిరియా మొదటి కేసులను నమోదు చేసుకున్నాయి.

నేపాల్​ మొత్తం దిగ్బంధంలో..

మన సరిహద్దు దేశం నేపాల్​లో ఇప్పటివరకు రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అక్కడ దేశవ్యాప్తంగా దిగ్బంధం విధించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానుంది. మార్చి 31వరకు కొనసాగనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

పాకిస్థాన్​లో

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 803కు చేరింది. వీటిలో సింధ్​ రాష్ట్రంలో 352, పంజాబ్​లో 246 కేసులు నమోదయ్యాయి.

సింగపూర్​లో ఒక్కరోజు 54 కేసులు పెరిగాయి. అక్కడ మొత్తం 509 మందికి వైరస్​ సోకింది.

కరోనాకు ఇద్దరు మిలిటరీ అధికారులు బలి

కరోనా వైరస్.. ఈజిప్టులో ఇద్దరు సీనియర్​ మిలిటరీ అధికారులను బలితీసుకుంది. వీరిలో మిలిటరీ ఇంజనీరింగ్ అథారిటీలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అధిపతి మేజర్ జనరల్ షఫీ దావూద్ ఒకరు. ఈజిప్టులో ఇప్పటివరకు 372 కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందారు.

'అందరూ ఇళ్లకే పరిమితం'

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆయా దేశాలు ఆదేశిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్​డౌన్ విధించాయి. మరికొన్ని దేశాలు వైరస్​ వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఫ్రాన్స్​, ఇటలీ, అర్జెంటినా, యూఎస్​ రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా, ఇరాక్​, రువాండా దేశాలతో పాటు పలు దేశాలు దిగ్బంధం విధించాయి.

ఇదీ చదవండి: కరోనాకు మరో 1,014 మంది బలి- ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు

Last Updated : Mar 23, 2020, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.