ETV Bharat / international

35వేలు దాటిన కరోనా మృతులు- స్పెయిన్​లో 812మంది - కరోనా వార్తలు

కరోనా వైరస్​తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఐరోపాపై వైరస్​ పంజా విసురుతోంది. స్పెయిన్​లో 812మంది 24 గంటల వ్యవధిలో మరణించారు. దీనితో ఆ దేశంలో మృతుల సంఖ్య 7వేల 340కి చేరింది. అటు ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది.

GLOBAL DEATH TOLL DUE TO CORONA VIRUS
35వేల చేరువలో కరోనా మృతులు- స్పెయిన్​లో 812మంది
author img

By

Published : Mar 30, 2020, 6:28 PM IST

కరోనా వైరస్​ ధాటికి ప్రపంచం గడగడలాడుతోంది. మృతుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 35వేలు దాటింది. ప్రస్తుతం 35వేల 004మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 7,38,233కు చేరింది.

స్పెయిన్​ గజగజ...

కరోనా వైరస్​ స్పెయిన్​పై పంజా విసురుతోంది. 24 గంటల వ్యవధిలోనే 812మంది వైరస్​తో మరణించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా స్పెయిన్​లో మృతుల సంఖ్య 7వేల 340కు చేరింది. మొత్తం 85వేల 195మందికి వైరస్​ సోకింది. అయితే మృతులు, కేసుల రేట్లు తగ్గుతున్నాయని ఆధికారులు వెల్లడించారు.

ఇరాన్​ పరిస్థితి...

ఇరాన్​లో తాజాగా 117మంది మరణించారు. దీనితో ఆ దేశంలో మృతుల సంఖ్య 2వేల 757కు చేరింది. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 40వేలు దాటింది. ప్రస్తుతం దేశం లాక్​డౌన్​లో ఉంది. అంతరాష్ట్ర ప్రయాణాలను కూడా నిషేధించింది ప్రభుత్వం.

పాక్​లో...

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 1,625కు చేరింది. మొత్తం 18మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా వైరస్​ విజృంభిస్తోందని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఆస్ట్రేలియా ఆర్థిక ప్యాకేజీ...

వైరస్​పై పోరుకు ప్రపంచ దేశాలు ఆర్థిక ప్యాకేజీలను అస్త్రంగా మలచుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రధాని.. 130 బిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఒక్కో ఉద్యోగికి ప్రతి రెండు వారాలకు 1,500 అస్ట్రేలియన్​ డాలర్లను జీతంగా అందిస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.