ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 10వేలకు చేరిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా 158 దేశాలకు కరోనా విస్తరించింది. వైరస్​ ధాటికి మరణించిన వారి సంఖ్య 10వేలకు చేరింది. ఇందులో అత్యధికంగా ఐరోపా దేశాల్లో కాగా ఆ తర్వాతి స్థానంలో ఆసియా దేశాలు ఉన్నాయి. మరోవైపు 3,405 మరణాలతో చైనాను అధిగమించింది ఇటలీ. ఈ నేపథ్యంలో నివారణ చర్యలను ముమ్మరం చేశాయి ఆయా దేశాలు.

Global coronavirus death toll
కోవిడ్ -19 తాజా వార్తలు
author img

By

Published : Mar 20, 2020, 5:49 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. వైరస్​కు కేంద్ర బిందువైన చైనాలో అదుపులోకి వచ్చినప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 158 దేశాలకు విస్తరించిన కరోనా 10,080మందిని బలి తీసుకుంది. సుమారు 2.32 లక్షల మంది వైరస్​ బారిన పడ్డారు. ఐరోపాలో 4,932, ఆసియాలో 3,431 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో వివిధ దేశాలు నివారణ చర్యల్లో భాగంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. పూర్తిస్థాయిలో నగరాలను మూసివేస్తున్నాయి.

వివిధ దేశాల్లో పరిస్థితి ఇలా..

  1. ఇరాన్​లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మరో 149 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,433కు చేరింది. 20వేల మంది ఈ వైరస్​ బారినపడ్డారు.
  2. అగ్రరాజ్యం అమెరికాలోని వివిధ రాష్ట్రాలు వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. కాలిఫోర్నియాను శుక్రవారం పూర్తిగా స్తంభింపజేశారు అధికారులు. కొవిడ్​-19 చికిత్సకు మలేరియా నిరోధక మందులు వాడుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ప్రపంచానికి వైరస్​ గురించి తెలపడంలో చైనా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
  3. వైరస్​ పుట్టినిల్లు చైనాలో వరుసగా రెండో రోజు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. డిసెంబర్​లో తొలి వైరస్​ కేసును గుర్తించిన తర్వాత చైనా కరోనాపై విజయం సాధించినట్లయింది. ఇప్పటి వరకు చైనాలో 3,248మంది మరణించారు.
  4. ఇటలీలో తాజాగా మరో 427 మరణాలు సంభవించాయి. దీంతో మృతుల సంఖ్య 3,405కు చేరింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఐరోపాలోని వివిధ దేశాల్లోనూ ఏప్రిల్​ 3 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయని అధికారులు వెల్లడించారు.
  5. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఫ్రాన్స్​లో విధించిన ఆంక్షలు మరో రెండు వారాలకు పెంచారు అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్​ మెక్రాన్​.
  6. అర్జెంటినాలో ఈ నెల 31వరకు దేశవ్యాప్తంగా షట్​డౌన్​ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రెజిల్​లోని ప్రముఖ బీచ్​లు, రెస్టారెంట్లు, బార్లు 15 రోజుల పాటు మూసివేశారు.
  7. రష్యాలో తొలి కరోనా మరణం సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
  8. ఆఫ్రికాలోని బర్కినా ఫాసోలో తొలి కరోనా మరణంతో సమీప దేశాలు నివారణ చర్యలు చేపట్టాయి. నైజీరియాలోని లాగోస్ నగరంలో పలు ఆంక్షలు విధించారు. పాఠశాలలు, దుకాణ సముదాయాలను మూసివేశారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​, వాట్సాప్​ సర్వర్లను వణికిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.