ETV Bharat / international

నావల్నీపై విష ప్రయోగం నిజమే: జర్మనీ - అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం నిజమే

రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం జరిగిందని ప్రాన్స్​, స్వీడన్​లోని ల్యాబ్​లు ధ్రువీకరించాయి. ఈ విషయాన్ని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి స్టెఫెన్ సీబర్ట్ వెల్లడించారు.

Germany: Foreign labs confirm Navalny poisoned with Novichok
నావల్నీపై విషయం ప్రయోగం నిజమే
author img

By

Published : Sep 14, 2020, 4:20 PM IST

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని ఫ్రాన్స్​, స్వీడన్‌లోని స్పెషలిస్ట్ ల్యాబ్‌లు ధ్రువీకరించినట్లు జర్మనీ​ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ సైనిక ల్యాబొరేటరీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు గుర్తు చేసింది.

ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ కూడా నావల్నీ నమూనాలను తీసుకున్నట్లు జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి స్టెఫెన్ సీబర్ట్ తెలిపారు.

ఓపీసీడబ్ల్యూలో కూడా పరీక్ష జరుగుతున్నప్పటికీ.. మూడు వివిధ ల్యాబొరేటరీలు రష్యా ప్రతిపక్ష నాయకుడైన నావల్నీపై విషప్రయోగానికి నోవిచొక్​ గ్రూప్​నకు చెందిన కెమికల్​ నర్వ్​ ఏజెంటే కారణమని ఇప్పటికే ధ్రువీకరించాయి.

స్టెఫెన్ సీబర్ట్, జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి

నావల్నీ నుంచి కొత్త నమూనాలకు పొందిన తర్వాత జర్మనీ.. ఫ్రాన్స్​, స్వీడన్​ నివేదికలను కోరిందని ఆయన తెలిపారు.

నావల్నీ ఆగస్టు 20న విమానంలో సృహతప్పి పడిపోయిన రెండు రోజుల తర్వాత అయనను జర్మనీకి తీసుకెళ్లారు. ఈ కేసుపై రష్యా దర్యాప్తు సంస్థ విచారణ జరపాలని జర్మనీ డిమాండ్​ చేసింది. మరోసారి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాలని పునరుద్ఘాటించారు సీబర్ట్​. అంతేకాకుండా దీనిపై ఐరోపా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

ఈ కేసుపై జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్, ప్రపంచ నాయకులు వివరణ ఇవ్వాలని కోరటాన్ని రష్యా​ తప్పుపట్టింది. మాస్కోపై బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. నోవిచొక్​ గ్రుప్​నకు చెందిన కెమికల్​​ నర్వ్​ను వాడినట్లు జర్మనీ తెలపటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రష్యా అధికారులు. దీనికి సంబంధించి సాక్ష్యాలను ఇవ్వాలని జర్మనీని కోరారు.

నావల్నీ ప్రస్తుతం అపస్మారక స్థితిలోనే ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.