ETV Bharat / international

గాంధీజీ స్మారకార్థం బ్రిటన్​ ప్రత్యేక​ 'నాణెం' - బ్రిటన్​ ప్రత్యేక నాణెం

మహాత్మా గాంధీని ప్రత్యేకంగా స్మరించుకుంది బ్రిటీష్​ ప్రభుత్వం. ఆ దేశ స్పెషల్​ కలెక్టర్ల నాణెంపై(gandhi coin uk ) గాంధీజీ జీవిత సందేశాన్ని ముద్రించింది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నాణేన్ని(mahatma gandhi british coin) ఆవిష్కరించింది.

Gandhi
గాంధీజీ స్మారకార్థం బ్రిటన్​ ప్రత్యేక​ 'నాణెం'
author img

By

Published : Nov 4, 2021, 9:48 AM IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత జాతిపిత మహాత్మాగాంధీని ప్రత్యేకంగా స్మరించుకుంది బ్రిటీష్​ ప్రభుత్వం. ఆయన జీవితసారాన్ని తెలిపేలా.. తొలిసారి బ్రిటిష్​ స్పెషల్​ కలెక్టర్ల నాణెం(gandhi coin uk) ముద్రించినట్లు యూకే ట్రెజరీ చీఫ్​ రిషి సునక్​ గురువారం ప్రకటించారు.

గుండ్రంగా ఉండే రాయల్​ నాణెంపై(mahatma gandhi british coin) గాంధీజీ ప్రముఖ మాట ' నా జీవితమే నా సందేశం 'తో పాటు భారత జాతీయ పుష్పం పద్మం ఉంటుందని తెలిపారు రిషి సునక్​. భారత స్వాతంత్య్రం కోసం అహింస మార్గాన్ని ఎంచుకున్న గాంధీజీని(Mahatma Gandhi ) అధికారిక యూకే నాణెంపై ముద్రించడం ఇదే తొలిసారని చెప్పారు.

" ఒక హిందువుగా.. దీపావళి సందర్భంగా ఈ నాణాన్ని ఆవిష్కరించటం చాలా సంతోషంగా ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ కీలక పాత్ర పోషించారు. తొలిసారి ఆయన విశేషమైన జీవితాన్ని గుర్తుచేసే యూకే నాణెం కలిగి ఉండటం చాలా అద్భుతంగా ఉంది. "

- రిషి సునక్​, ట్రెజరీ చీఫ్​.

5 పౌండ్లు విలువ గల ఈ నాణాన్ని బంగారం, వెండితో కలిపి తయారు చేశారు. అయితే.. దీనిని సాధారణ చలామణి కోసం ముద్రించలేదు. దీపావళి నుంచి దీనిని విక్రయించనున్నారు. ఈ నాణెంతో పాటు 1 గ్రాము, 5 గ్రాముల పసిడి కడ్డీలు ఇస్తారు. తొలిసారి ఈ కడ్డీలపై హిందూ దేవత మహాలక్ష్మీని ముద్రించి ఇస్తుండటం గమనార్హం. వైవిధ్యమైన బ్రిటన్​ నిర్మాణం పేరుతో సరికొత్త 50పీ నాణేన్ని గత ఏడాది తీసుకొచ్చారు రిషి. 2020, అక్టోబర్​ నుంచి ఇప్పటి వరకు 10 మిలియన్​ నాణెలు చలామణిలోకి వచ్చాయి.

ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: గాంధీ కోరిన దీపావళి వెలుగులివీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.