ఫ్రాన్స్‌లోని లయన్ నగరంలో శుక్రవారం పేలుడు జరిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో నగరంలో రద్దీగా ఉండే పాదచారుల వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలో మరో రెండురోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పేలుడు సంభవించడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
మేకులున్న ఓ ప్యాకేజీని పేలుడుకు వినియోగించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.
పేలుడు అనంతరం అనుమానాస్పదంగా కనిపిస్తూ... ఘటనాస్థలం నుంచి జారుకున్న ఓ వ్యక్తిని సీసీటీవీ కెమెరాల దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించాయి. అనుమానితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పేలుడును ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఖండించారు. తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.
ఇదీ చూడండి: 17వ లోక్‌సభకు రికార్డు స్థాయిలో 'నారీ శక్తి'