బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టమైన బ్రెగ్జిట్‌కు మార్గం మరింత సుగమమైంది. మరో 24 గంటల్లో (జనవరి 31) ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగనున్న నేపథ్యంలో బ్రెగ్జిట్ ఒప్పందానికి తాజాగా యూరోపియన్ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. బ్రిటన్‌తో ఈయూకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చట్టసభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం 621-49 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్‌కు అంగీకారం తెలిపారు. 'ఆల్డ్ లాంగ్ సైన్' అనే సంప్రదాయ పాటతో బ్రిటన్‌కు వీడ్కోలు పలుకుతూ.. దాదాపు 50 ఏళ్లపాటు సాగిన తమ స్నేహాన్ని స్మరించుకున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందానికి క్వీన్ ఎలిజబెత్-2 ఇదివరకే అధికారిక ముద్ర వేయగా ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా సంతకం చేశారు.
పంతం నెగ్గించుకున్న బోరిస్
మాజీ ప్రధాని థెరెసా మే... 2018లో బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలు జరిపారు. దిగువసభ ఈ విషయాన్ని మూడుసార్లు తిరస్కరించింది. ఫలితంగా.. థెరెసా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్... బ్రెగ్జిట్‌ను సాకారం చేసేందుకు చాలా కృషి చేశారు. మెజారిటీ లేకపోవడం వల్ల ఎన్నికలకు వెళ్లారు. జాన్సన్ అధిక మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఎంపీలు ఈ ఒప్పందానికి మద్దతు పలికారు.
బ్రెగ్జిట్ తరువాతేంటి?
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగిన తరువాత ఏం చేయాలనే దానిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ ఫిబ్రవరి ప్రారంభంలో ఓ విధాన నిర్ణయం తీసుకునే అవకాశముంది