ETV Bharat / international

దక్షిణాసియా వరద బాధితులకు ఈయూ రూ.14కోట్ల సాయం

దక్షిణాసియాలో వరదల ప్రభావానికి గురై.. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఐరోపా సమాఖ్య అండగా నిలిచింది. ఈ మేరకు భారత్​, బంగ్లాదేశ్​ సహా ఇతర దేశాలకు 1.65మిలియన్​ యూరోలను సహాయంగా అందిస్తున్నట్టు ప్రకటించింది.

EU to provide EUR1.65 million in humanitarian aid to support those affected by flooding in South Asia
దక్షిణాసియా వరద బాధితులకు ఈయూ 14కోట్ల సహాయం
author img

By

Published : Aug 12, 2020, 5:37 AM IST

భారత్​, బంగ్లాదేశ్​, నేపాల్​ సహా దక్షిణాసియాలో వరదల ప్రభావానికి గురైన దేశాలకు ఐరోపా సమాఖ్య అండగా నిలిచింది. విపత్తుతో దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయం చేసేందుకు 1.65మిలియన్​ యూరోల(రూ.14.51కోట్లు)ను అందిస్తున్నట్టు ప్రకటించింది.

"దక్షిణాసియాలో వర్షాకాలం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ అత్యవసర సహాయం.. క్షేత్రస్థాయిలో ఉండి సేవలందిస్తున్న మా భాగస్వాములకు ఉపయోగపడుతుంది. తిండి, గూడు, నీడ, జీవనాధారం కోల్పోయిన వారికి ఈ సహాయం అందుతుంది."

--తహీని థమ్మన్నగోడ, ఈయూ హ్యుమానిటేరియన్​ ప్రోగ్రామ్స్​ ఇన్​ ఏషియా అండ్​ పసిఫిక్​ విభాగం.

అయితే అంపన్​ తుపానుతో పాటు ఇతర వ్యాధులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే 1.8మిలియన్​ యూరోలను ప్రకటించింది ఈయూ. దీంతో.. ఈ ఏడాది దక్షిణాసియాకు ఇప్పటివరకు మొత్తం మీద 3.45మిలియన్​ యూరోల సహాయాన్ని అందించింది.

తాజాగా ప్రకటించిన 1.65మిలియన్​ యూరోల్లో.. 1 మిలియన్ నిధులు బంగ్లాదేశ్​లోని అత్యవసర పనులకు వినియోగించినట్టు ఈయూ వెల్లడించింది. ఆ దేశంలోని 20లక్షలకు మందిపైగా నీరు, నీడ కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. మరో 0.500మిలియన్​ యూరోలు.. నీరు, తిండి, సహాయక చర్యల కోసం భారత్​కు ​అందించనున్నట్టు స్పష్టం చేసింది. మిగిలిన 0.150మిలియన్​ యూరోలను నేపాల్​కు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:- భారత్‌-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.