ETV Bharat / international

బ్రిటన్​కు ఈయూ మూడు రోజుల అల్టిమేటం

ఐరోపా సమాఖ్యతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు బ్రిటన్​కు మూడు రోజుల గడువుతో అల్టిమేటం జారీ చేసింది ఐరోపా పార్లమెంట్. ఈ ఏడాదిలోనే ఒప్పందం ఆమోదం పొందాలంటే ఆదివారంలోపు అగ్రిమెంట్ సిద్ధం కావాలని స్పష్టం చేసింది. గడువు తర్వాత ఒప్పందం సిద్ధమైతే.. దాన్ని 2021లోనే ఆమోదిస్తామని తేల్చిచెప్పింది.

EU Parliament issues 3-day ultimatum for post-Brexit deal
బ్రిటన్​కు ఈయూ మూడు రోజుల అల్టిమేటం
author img

By

Published : Dec 18, 2020, 7:35 AM IST

ఐరోపా సమాఖ్యతో బ్రెగ్జిట్ అనంతరం వర్తక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు బ్రెగ్జిట్ మధ్యవర్తులకు మూడు రోజుల గడువు విధించింది ఐరోపా పార్లమెంట్. ఆదివారం నాటికి ఒప్పందం సిద్ధం కాకపోతే.. దాన్ని ఈ ఏడాదే ఆమోదించేందుకు ఐరోపా పార్లమెంట్ సభ్యులకు సమయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్టిమేటం జారీ చేసింది.

ఒప్పందంపై జరిగిన చర్చల గురించి ఈయూ ముఖ్య మధ్యవర్తి మైకేల్ బార్నియర్ వివరాలు సమర్పించిన అనంతరం పార్లమెంట్ ఈ మేరకు స్పందించింది. ఈ నెల చివరినాటికి ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమేనని, అయితే డిసెంబర్ 20 అర్ధరాత్రిలోపు ఒప్పందం పూర్తి కావాలని షరతు విధించింది. గడువు తర్వాత ఒప్పందం ఖరారైతే.. దాన్ని 2021లోనే ఆమోదిస్తామని వెల్లడించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు బోరిస్ జాన్సన్​కు ఆదివారం వరకు సమయమిస్తున్నామని పేర్కొంది.

బ్రెగ్జిట్ పూర్తయినా..

జనవరి 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగింది. కానీ ఆర్థికం, వర్తకం వంటి విషయాల్లో ఒకే మార్కెట్​గా కొనసాగుతూ వచ్చింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయ్యే డిసెంబర్ 31 వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండానే ఈయూ దేశాలతో వర్తకం సాగించే అవకాశం బ్రిటన్​కు ఉంది. ఆ లోపు ఈయూతో ఒప్పందం కుదరకపోతే స్వేచ్ఛా వాణిజ్యానికి విఘాతం కలుగుతుంది.

బ్రెగ్జిట్ వాణిజ్యానికి సంబంధించి ఏ ఒప్పందాన్నైనా బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శుక్రవారం నుంచి జనవరి 5 వరకు క్రిస్మస్ సెలవుల్లో ఉండనున్నారు. అయితే.. ఒకవేళ ఒప్పందం చివరిదశకు చేరుకుంటే 48 గంటల నోటీసుతో వారిని వెనక్కి రప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.