నానాటికీ పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యంపై కదంతొక్కారు బ్రిటన్వాసులు. పర్యావరణ సంరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై నిరసనగా వందల మంది వీధుల్లోకి వచ్చారు. కాలుష్యంపై అవగాహన పెంచేందుకు చేపడుతోన్న ఆందోళనలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
లండన్‌లోని ప్రధాన నగరాలలో గత సోమవారం నుంచి వందల మంది బ్రిటన్వాసులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. థేమ్స్ నదిపై ఉన్న వాటర్లూ వంతెన, పార్లమెంట్ ఆవరణ, ఆక్స్ఫర్డ్ సర్కస్, మార్బెల్ ఆర్చ్‌ల వంటి ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలతో లండన్ నగరవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది.
ఈస్టర్ సెలవులతో... వారాంతంలో యూరప్‌లోనే అత్యంత రద్దీ గల హీత్రో విమానాశ్రయం వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఆందోళనకారులు. బ్రిటన్ ప్రభుత్వం.. సంరక్షణ చర్యలకు ఉపక్రమించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
నిరసనలు చేస్తున్న సుమారు 460 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.