ETV Bharat / international

'విదేశాల్లోని వాద్రా ఆస్తుల వివరాలు వెల్లడించండి'

మనీలాండరింగ్‌ కేసులో రాబర్ట్‌ వాద్రాపై దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముమ్మరం చేసింది. బ్రిటన్‌లో వాద్రా కొనుగోలు చేసినట్లు భావిస్తున్న ఆస్తులకు సంబంధించి యాజమాన్య, ఆర్థిక లావాదేవీల వివరాలను సమర్పించాలని ఆ దేశంలోని సంబంధిత సంస్థలను కోరింది ఈడీ.

author img

By

Published : Jun 7, 2019, 7:27 AM IST

Updated : Jun 7, 2019, 7:52 AM IST

'విదేశాల్లోని వాద్రా ఆస్తుల వివరాలు వెల్లిడించండి'

రాబర్ట్‌ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. విదేశాల్లో అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై విచారణలో భాగంగా యూకే అధికారులను సంప్రదించింది. వాద్రాకు సంబంధించిన ఆస్తులు, నగదు చలామణీ పూర్తి వివరాలను అందించాల్సిందిగా యూకే అధికారులను కోరింది. యూకేతో పాటు వివిధ దేశాలకు చెందిన ఆర్థిక నిఘా సంస్థలనూ కోరినట్లు ఈడీ ఉన్నతాధికారులు తెలిపారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం అక్రమంగా కొనుగోలు చేసిన లండన్‌లోని ఆస్తులను అటాచ్‌ చేసే దిశగా ఈడీ సన్నద్ధం అవుతున్నట్లు వెల్లడించారు.

ఇవి మాత్రమే కాకుండా యూకేలోని మరికొన్ని అక్రమ ఆస్తులతో వాద్రాకు సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఆస్తుల కోనుగోలుకుగాను సైప్రస్‌, దుబాయ్‌ దేశాల్లో నగదు లావాదేవీలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారముంది.

అక్రమ ఆస్తుల కొనుగోలు విషయంలో ఇప్పటికే రాబర్ట్‌ వాద్రాను ఈడీ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. అయితే వాద్రా నుంచి సరైన వివరాలను రాబట్టలేకపోయారు. పూర్తి స్థాయిలో రాబర్ట్‌ వాద్రాను విచారించేందుకు ఆయనకిచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు అధికారులు.

ఇదీ చూడండి : కీలక మంత్రిత్వశాఖల నుంచి సిద్ధూ తొలగింపు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 6th June 2019.
++FULL STORYLINE AND SHOTLIST TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:11
STORYLINE:
FIFA President Gianni Infantino gave his reaction following the news on Thursday that Confederation of African Football President and FIFA vice-president Ahmad Ahmad has been detained for questioning by French authorities in Paris.
++MORE TO FOLLOW++
Last Updated : Jun 7, 2019, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.