ఐరోపాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. జర్మనీ, బెల్జియంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 150కి పెరిగింది. వర్షాల బీభత్సానికి వందలాది మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని రైన్లాండ్, పలాటినేట్ ప్రాంతాల్లోనే వరదల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నార్త్ రైన్- వెస్ట్ ఫాలియా రాష్ట్రంలో మృతుల సంఖ్య 43కు చేరింది. బెల్జియంలో 27 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. కొట్టుకుపోయి పడి ఉన్న కార్లు, ట్రక్కుల్లో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
జర్మనీలోని ఈర్ఫ్స్టాడ్ ప్రాంతంలో మిలిటరీ సహయక చర్యలు కొనసాగిస్తోంది. వరద ముంపులో కూరుకుపోయిన కార్లను వెలికితీస్తున్నారు.
బెల్జియంలో మియూస్ రివర్ ఉద్ధృతితో లీగెలోని బ్రిడ్జ్ ఇలా ప్రవాహంలో మునిగిపోయింది. రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతింది.
బెల్జియం పిపినస్టర్ ప్రాంతంలో జలమయమైన కాలనీల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో కొట్టుకువచ్చిన వ్యర్థాలను యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు.
మరోవైపు ముంపు ప్రాంతం నుంచి పునరావాస ప్రాంతాని జనం తరలివెళ్తున్నారు. నీట మునిగిన కాలనీ నుంచి ఓ వ్యక్తి ఇలా బయటకు వెళ్తున్నారు.
బెల్జియంలోని లీగె పట్టణంలో మియూర్ రివర్ వరదల్లో కారు ఇలా కొట్టుకుపోతోంది. వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది.
వరదల ఉద్ధృతితో జనావాసాలు నీట మునిగాయి. బెల్జియంలోని పిపిన్స్టర్లో చుట్టూ వరద ప్రవాహంలో ఇళ్లు ఇలా దర్శనమిచ్చాయి.
బెల్జియంలో మెయూస్ రివర్ ఉప్పంగగా.. లీగె పట్టణ ప్రజలు ఇలా రబ్బర్ బోట్లను ఉపయోగించుకుని బయటకు వస్తున్నారు.
ఇదీ చదవండి:ముంచెత్తిన వరద- 110 మంది బలి