ETV Bharat / international

Covid cases in uk: బ్రిటన్​లో ఆల్​టైం రికార్డుగా కరోనా కేసులు - బ్రిటన్​లో ఒమిక్రాన్​ కేసులు

Covid cases: బ్రిటన్​లో ఒక్కరోజే 93 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు.

covid cases
బ్రిటన్​లో కరోనా కేసులు
author img

By

Published : Dec 18, 2021, 12:09 AM IST

Updated : Dec 18, 2021, 2:42 AM IST

Covid cases: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే 93,045 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటితో పాటు కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు కూడా యూకే లో బాగా పెరిగాయి. మరో 3,201 కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 14,909కి చేరింది.

యూకేలో మరో 111 మంది వైరస్​ కారణంగా చనిపోయినట్లు అధికారుల వెల్లడించారు. దీంతో మొత్తం మరణాలు 1,47,048 కు చేరాయి. అంతేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వ్యాప్తి బ్రిటన్​లో ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్​ కేసులు రెండు నుంచి మూడు రోజుల్లో రెట్టింపు అవుతున్నాయని వైద్యాధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్​ 17 నాటికి 2,55,98,784 మందికి బూస్టర్​ డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

Novavax vaccine: నొవావాక్స్‌ టీకాకు WHO అనుమతి

Last Updated : Dec 18, 2021, 2:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.