ETV Bharat / international

'ఈ ఏడాది వ్యాక్సిన్ వస్తుందనుకుంటే మూర్ఖత్వమే!'

కరోనా వ్యాక్సిన్​ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న వారికి షాకిచ్చారు ఇంగ్లండ్ చీఫ్‌ వైద్యాధికారి. ఈ ఏడాదిలో వ్యాక్సిన్ వస్తే అద్భుతమేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వచ్చే శీతాకాలం నాటికి వ్యాక్సిన్‌ వస్తుందనే ఆశతో ప్రణాళికలు వేసుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం లేదన్నారు.

covid-19-vaccine-may-be-not-ready-in-this-year
'ఈ ఏడాది వ్యాక్సిన్ వస్తుందనుకుంటే మూర్ఖత్వమే!'
author img

By

Published : Aug 23, 2020, 8:18 PM IST

ప్రపంచమంతా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా... అని ఎదురు చూస్తుంటే ఇంగ్లండ్‌ ముఖ్య వైద్యాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది కూడా సిద్ధం కాకపోవచ్చని చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ క్రిస్‌ విట్టే చెప్పారు. ఈ ఏడాది క్రిస్మస్‌ నాటికి ఏ ఒక్క వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా అద్భుతమేనని వ్యాఖ్యానించారు. రాబోయే శీతాకాలంలో కొవిడ్‌ వల్ల వచ్చే అసలైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చే శీతాకాలం నాటికి వ్యాక్సిన్‌ వస్తుందనే ఆశతో ప్రణాళికలు వేసుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం లేదన్నారు.

"వ్యాక్సిన్‌ వస్తే ఎంతో సంతోషిస్తా. అయితే పెద్ద సంఖ్యలో జనాభాకు అందించేందుకు ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ ఈ శీతాకాలం లోపు వస్తే ఆశ్చర్యకరమే. ఇది ఇప్పుడు తప్పుడు వాదన కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. చాలా మంది శాస్త్రీయంగా, లాజిస్టిక్‌గా ఇది నిరాశావాద ప్రకటన అని అనుకోవచ్చు. వ్యాక్సిన్‌ అత్యంత వేగంగా తయారు చేశాక అది పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలి. సురక్షితమని నిర్ధారించుకోవడానికి సమయం పడుతుంది.వ్యాక్సిన్‌ తయారీలో ఆరు నెలల కంటే సంవత్సరం పాటు ఆగితే మెరుగైన అవకాశాలు కనిపిస్తాయి. మనకు వ్యాక్సిన్‌ రాదనే ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలి. ఒకవేళ ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి అది సురక్షితమని నిరూపితమైతే మనం బలమైన స్థితిలో ఉంటాం. ఈ మహమ్మారి నుంచి సైన్స్‌ బయటపడేస్తుందనే నమ్మకం నాకు ఉంది. అయితే ఇది కేవలం కొన్ని వారాలు, నెలల్లోనే జరిగిపోతుందని మాత్రం నేను ఊహించలేను."

- ప్రొఫెసర్‌ క్రిస్‌ విట్టే, ఇంగ్లండ్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్

ఇదీ చదవండి: ప్రాణానికి ప్రాణం అడ్డేసిన జవాన్లు- సలాం చేసిన కొండకోనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.