ETV Bharat / international

ప్రపంచ వ్యాప్తంగా 14,436కి చేరిన కరోనా మృతులు - Corona today updates

ప్రపంచ దేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకోస్థాయిలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. ఇప్పటివరకు 14,436 మందిని పొట్టనపెట్టుకుంది. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అమాంతం పెరిగి 3.32 లక్షలకు చేరింది. ఇటలీలో ఒక్కరోజే 651 మంది మృతిచెందారు. అగ్రరాజ్యం అమెరికాలో 120మందికి పైగా మరణించారు.

Corona deaths reach to 14,436
ప్రపంచ వ్యాప్తంగా 14,436కి చేరిన కరోనా మృతులు
author img

By

Published : Mar 23, 2020, 5:44 AM IST

ప్రపంచ వ్యాప్తంగా 14,436కి చేరిన కరోనా మృతులు

ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు విస్తరించిన కరోనా పలు దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇప్పటివరకు 14,436 మందిని బలితీసుకుంది. కేసుల సంఖ్య కూడా అమాంతం పెరిగి.. ఏకంగా 3.32 లక్షలకు చేరింది. ఇటలీపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న ఈ మహమ్మారి ధాటికి.. ఒక్కరోజులో 651 మంది బలయ్యారు. ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య రికార్డు స్థాయిలో 5,476కు చేరింది. కొత్తగా 5,560 కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 59,138 మంది వైరస్​ బారినపడ్డారు.

ఇటలీ తర్వాత స్పెయిన్​లో..

ఇటలీ తర్వాత స్పెయిన్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ దేశంలో ఒక్కరోజే 375 మంది చనిపోగా.. 3,107 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 28,603కు చేరింది.

అమెరికాను కొవిడ్​-19 తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజులోనే అక్కడ 120 మందికిపైగా మృత్యువాతపడ్డారు. మరో 8,500 మందికిపైగా కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది.

ఒక్కరోజు వ్యవధిలో ఆయా దేశాలపై కరోనా ప్రభావం:

  • ఇరాన్​లో కరోనా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజులో 129 మంది చనిపోయారు. సుమారు 1,000కి పైగా కొత్త కేసులు బయటపడ్డాయి.
  • ఫ్రాన్స్‌లో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,559 మంది వైరస్​ బారినపడ్డారు.
  • బ్రిటన్‌లో 48 మంది, నెదర్లాండ్స్​లో 43 మంది వైరస్​ సోకి మృత్యువాతపడ్డారు.
  • స్విట్జర్లాండ్‌, ఇండోనేషియా, జర్మనీ దేశాలలో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. కొత్తకేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా సోకిన వైద్యుణ్ని కలిసిన కారణంగా జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

  • సిరియాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విదేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది.

లాక్​డౌన్లు సరిపోవు..

అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధి మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా.. ఆయా దేశాలు కీలక చర్యలు చేపట్టాలని కోరారు​. కరోనా బాధిత దేశాలు పాజిటివ్​ కేసులను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్‌ వార్డుకు తరలించడంపై దృష్టిసారించాలని సూచించారు. లాక్​డౌన్​లు విధించినంత మాత్రాన వైరస్​ను అరికట్టలేమని.. సరైన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ లాక్​డౌన్​లే ప్రమాదకరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని మైక్​ హెచ్చరించారు.

చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్‌ బాధితులను వేగంగా గుర్తించాయన్న మైక్​.. మిగతా దేశాలు వాటిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు ​. త్వరలోనే ఈ మహమ్మారికి టీకా వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: నిర్భయ దోషుల ఉరిపై ఐరాస ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.