జర్మనీ పురాతన నగరం బాన్‌లో ఏటా జరిగే అద్భుతం చెర్రీ పూల వసంతం. వీధులన్నీ పూర్తిగా లేత గులాబీ రంగు చెర్రీ పూలతో పులకింపజేస్తున్నాయి. మరో 2 వారాలు మాత్రమే పూచే ఈ పుష్పాలను చూడడానికి దేశవిదేశాల పర్యటకులు బాన్ నగరానికి చేరుకుంటున్నారు.
జర్మనీ ఏకీకరణకు ముందు రాజధాని నగరంగా బాన్ ఓ వెలుగు వెలిగింది. 1980ల్లో ఈ మహోన్నత నగరానికి రిటైర్డ్ సిటీ ప్లానర్ బ్రిగిట్టె డెంకల్ పునఃరూపకల్పన చేశారు. జపాన్ వారు బహూకరించిన చెర్రీ మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటించారు. నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి ప్రతి వసంతకాలంలోనూ పూచే ఈ పుష్పాలు చూడడానికి ప్రకృతి ప్రేమికులు ఈ నగరానికి వస్తూనే ఉన్నారు.
ఇదీ చూడండి: కృత్రిమ మేధతో 'రోబో సైనికులు' వస్తున్నారు!