ETV Bharat / international

హ్యారీ-మేఘన్​ వ్యాఖ్యలపై రాజకుటుంబం స్పందన

author img

By

Published : Mar 10, 2021, 5:39 AM IST

రాజకుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలపై ప్రిన్స్​ హ్యారీ, మేఘన్ దంపతులు చేసిన వాఖ్యలకు బకింగ్​హామ్​ ప్యాలెస్ స్పందించింది. దంపతులు ఈ సమస్యలు ఎదుర్కోవడం బాధకరమని తెలిపింది. జాతి వివక్షను తాము తీవ్రంగా పరిగణిస్తామని ప్రకటనలో పేర్కొంది. ​

meghan markel
మేఘన్​ వ్యాఖ్యలపై స్పందించిన రాజకుంటుబం

మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల ఇంటర్వ్యూపై బ్రిటన్ రాజకుటుంబం స్పందించింది. ఈ విషయంపై బకింగ్​హామ్ ప్యాలెస్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. హ్యారీ మేఘన్​ దంపతులు ఎదుర్కొన్న సమస్యలకు చింతిస్తున్నామని పేర్కొంది.

"హ్యారీ మేఘన్ దంపతులు గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న ఇబ్బందులపై మేము చింతిస్తున్నాము. ఇంటర్వ్యూలో పేర్కొన్న పలు సమస్యలు, ముఖ్యంగా జాతి వివక్ష.. ఆందోళనకరం. కొన్ని అంశాలు వేరుగా ఉండొచ్చు.. కానీ వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సమస్యను కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించేందుకు ప్రయత్నిసాం. హ్యారీ, మేఘన్​, ఆర్చీ ఎప్పటికీ మా కుటుంబానికి ప్రత్యేకమే."

-బకింగ్​హామ్ ప్యాలెస్

తీవ్రంగా పరిగణించాలి..

జాతివివక్షకు సంబంధించి హ్యారీ దంపతులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

"హ్యారీ దంపతులు ఈ పరిస్థితులను ఎదుర్కోవడం చాలా బాధకరం. జాతివివక్ష, మానసిక సమస్యలపై మేఘన్ లేవనెత్తిన విషయాలు తీవ్రంగా పరిగణించాలి. 21వ శతాబ్దంలో కూడా బ్రిటన్​లో జాతివివక్ష కొనసాగుతోంది. ఈ విషయంపై తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈ సమస్య కేవలం రాజకుటుంబానికి మాత్రమే పరిమితమైనది కాదు."

-సర్​ కైర్ స్టార్మర్​, ప్రతిపక్ష నేత

కాగా, ఈ విషయంపై స్పందించేందుకు బ్రిటన్ ప్రధాని నిరాకరించారు. రాజకుటుంబం అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేనని పేర్కొన్నారు. ఓ ప్రధానిగా తాను మౌనంగా ఉండటమే ఉత్తమమని అన్నారు.బ్రిటన్ రాణి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు.

వారు కాదు..

రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ మేఘన్ దంపతులు సోమవారం తొలిసారిగా మాట్లాడారు. అమెరికా టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకుటుంబంలో ఎదురైన అనుభవాలపై మేఘన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానసిక సమస్యలు ఎదురవడమే కాక తనకు పుట్టబోయే బిడ్డ శరీర రంగు గురించి రాజకుటుంబంలో కొందరు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరై ఉంటారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దంపతులను ఇంటర్వ్యూ చేసిన ఓఫ్రా విన్రే క్లారిటీ ఇచ్చారు. 'జాతివివక్ష వ్యాఖ్యలకు తన నాయనమ్మ, తాతయ్యలకు (బ్రిటన్ రాణి ఎలిజబెత్​, ప్రిన్స్ ఫిలిప్​) ఎలాంటి సంబంధం లేదని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు' అని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'రాజకుటుంబంలోకి వచ్చాక చచ్చిపోదామనుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.