ETV Bharat / international

బ్రెగ్జిట్​: బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు ఎదురుదెబ్బ

author img

By

Published : Oct 19, 2019, 10:09 PM IST

Updated : Oct 19, 2019, 10:55 PM IST

బ్రెగ్జిట్​ ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్​లో జరిగిన చారిత్రక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఒప్పదం వాయిదా వేయాలంటూ బ్రిటన్​ ఎంపీలు ఓటేశారు. గడువు మరోసారి పొడిగించాలని ఐరోపా సమాఖ్యను కోరాలన్న ప్రతిపాదనకు చట్టసభ్యులు మొగ్గుచూపారు. అందుకు ఆస్కారం లేదని ప్రధాని బోరిస్ జాన్సన్​ తేల్చిచెప్పారు.

బ్రెగ్జిట్​ ఒప్పందంపై బోరిస్​ జాక్సన్​కు ఎదురుదెబ్బ..

బ్రెగ్జిట్​పై బ్రిటన్ పార్లమెంటులో జరిగిన చారిత్రక ఓటింగ్ ప్రక్రియలో ప్రధాని బోరిస్ జాన్సన్​కు ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని అధ్యయనం చేసేందుకు సమయం కావాలంటూ బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు ఓటేశారు.

అక్టోబర్ 31కి బ్రెగ్జిట్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గడువును జనవరి వరకూ పొడిగించేలా ఐరోపా సమాఖ్యను అభ్యర్థించాలన్న ప్రతిపాదనకు బ్రిటన్ పార్లమెంట్ 322-306 ఓట్ల తేడాతో ఆమోదం పలికింది.

అటు గడువు పొడిగించాలంటూ... ఈయూని అభ్యర్థించే ప్రసక్తే లేదని బోరిస్‌ జాన్సన్ స్పష్టం చేశారు.

ఈ ఓటింగ్ ప్రక్రియ ఎందుకంత కీలకం?

ఈ ఓటింగ్​ కోసం బ్రిటన్​ పార్లమెంట్​ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. 1982 తర్వాత శనివారం రోజున బ్రిటన్​ పార్లమెంట్​ సమావేశం జరగడం ఇదే తొలిసారి.
బ్రెగ్జిట్​కు ఆమోదం లభించలేదు కాబట్టి.. ఆప్రక్రియను ఆలస్యం చేయడానికి చట్టం రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. అయితే బ్రెగ్జిట్​ను వాయిదా వేయడం సరికాదని బోరిస్​ ఇటీవల అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: లెబనాన్​: పన్ను విధింపుపై పెల్లుబికిన ప్రజాగ్రహం

Mumbai, Oct 19 (ANI): Bollywood mega star, Amitabh Bachchan discharged from a hospital in Mumbai on Oct 18 after being admitted here following routine check-ups. The 77-year-old actor had gone for a routine check-up at the hospital after experiencing some health issues on Wednesday. He, however, remained in the hospital for two days before being discharged on late Friday. Big B left hospital with wife Jaya Bachchan and son Abhishek.

Last Updated : Oct 19, 2019, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.