ETV Bharat / international

భారతీయ- బ్రిటన్ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు - 2020 మిలీనియమ్ టెక్నాలజీ ప్రైజ్

భారతీయ మూలాలున్న బ్రిటన్​ శాస్త్రవేత్త శంకర్ బాలసుబ్రమణియన్ అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్ఠాత్మక.. '2020 మిలీనియన్ టెక్నాలజీ ప్రైజ్​'ను గెలుచుకున్నారు.

britain scientist
బ్రిటన్ శాస్త్రవేత్త, మిలీనియమ్ టెక్ ప్రైజ్
author img

By

Published : May 19, 2021, 6:32 AM IST

బ్రిటన్​లో భారతీయ మూలాలున్న శాస్త్రవేత్త శంకర్ బాలసుబ్రమణియన్ అరుదైన ఘనత సాధించారు. శాస్త్ర, సాంకేతికత రంగంలో ప్రతిష్ఠాత్మక అవార్డు పొందారు.

లండన్​లోని కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయానికి చెందిన మరో శాస్త్రవేత్త డేవిడ్ క్లెనెర్​మన్​తో కలిసి సంయుక్తంగా '2020 మిలీనియమ్ టెక్నాలజీ ప్రైజ్'ను అందుకున్నారు బాలసుబ్రమణియన్. డీఎన్​ఏకు సంబంధించిన పరిశోధనలో వీరికి ఈ అవార్డు దక్కింది. టెక్నాలజీ అకాడమీ ఫిన్​లాండ్(టీఏఎఫ్)​ ఈ అవార్డు ప్రదానం చేసింది.

ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్, బ్రిటీష్ బయోఫిజికల్ కెమిస్ట్ క్లెనెర్​మన్.. సోలెక్సా అనే సంస్థను స్థాపించారు. నెక్స్ట్ జనరేషన్ డీఎన్​ఏ సీక్వెన్సింగ్​ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అవార్డు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: విజయ్ మాల్యాకు కోర్టులో మరో ఎదురుదెబ్బ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.