ETV Bharat / international

డయాలసిస్​ రోగికి ఆక్స్​ఫర్డ్​ తొలి టీకా - first Oxford vaccine in Britain

ఆస్ట్రాజెనెకా-ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ సంయుక్తం అభివృద్ధి చేసిన టీకాతో వ్యాక్సినేషన్​ ప్రారంభించింది బ్రిటన్. తొలి టీకాను.. 82 ఏళ్ల డయాలసిస్​ రోగి అయిన బ్రియాన్​ పింకర్‌కు అందించారు.

Britain begins inoculating its citizens with the AstraZeneca/Oxford vaccine against COVID-19 giving the shot to Brian Pinker
తొలి ఆక్సఫర్డ్​ టీకా తీసుకున్న డయాసిస్​ రోగి
author img

By

Published : Jan 4, 2021, 2:21 PM IST

Updated : Jan 4, 2021, 2:57 PM IST

స్వదేశంలో అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్‌తో టీకాలు వేయడం ప్రారంభించింది బ్రిటన్​. ఆక్స్‌ఫర్డ్‌లోని ఓ ఆసుపత్రిలో డయాలసిస్​ రోగి అయిన 82ఏళ్ల బ్రియాన్​ పింకర్‌కు తొలి టీకా వేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రియాన్​.. టీకా వేయించుకోవడాన్ని ఓ మైలురాయిగా అభివర్ణించింది ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థ.

Britain begins inoculating its citizens with the AstraZeneca/Oxford vaccine against COVID-19 giving the shot to Brian Pinker
టీకా వేయించుకుంటున్న బ్రియాన్​ పింకర్‌

టీకా అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్న బ్రియాన్​.. ఇప్పుడు ప్రశాంతంగా డయాలసిస్​కు వైద్యం చేయించుకుంటానని చెప్పారు. 'కరోనా వ్యాక్సిన్​ పొందడం పట్ల సంతోషంగా ఉంది. ఈ టీకాను ఆక్స్​​ఫర్డ్ అభివృద్ధి చేయడం గర్వంగా ఉంది. దీని వల్ల వైద్య సిబ్బంది సురక్షితంగా ఉంటారు. ఈ ఏడాది తర్వాత నా భార్యతో 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటాను." అని బ్రియాన్ అన్నారు.

ఇప్పటికే కరోనా నివారణకు ఫైజర్ టీకాతో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్​ నిర్వహిస్తోంది బ్రిటన్ ప్రభుత్వం.

ఇదీ చూడండి: జాక్​ మా ఎక్కడ?.. 2 నెలలుగా బిలియనీర్ అదృశ్యం

Last Updated : Jan 4, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.